బోర్డు సమావేశం తర్వాత ఊర్జిత్ పటేల్ పదవిలో ఉంటారా... వైదులుగుతారా...?

బోర్డు సమావేశం తర్వాత ఊర్జిత్ పటేల్ పదవిలో ఉంటారా... వైదులుగుతారా...?
x
Highlights

కేంద్రం, ఆర్ బిఐ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరిందా...? అసలు కేంద్రానికి, ఆర్ బిఐకి మధ్య ఎక్కడ, ఎందుకు చెడింది... ? నెల తిరక్కుండానే రిజర్వు...

కేంద్రం, ఆర్ బిఐ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరిందా...? అసలు కేంద్రానికి, ఆర్ బిఐకి మధ్య ఎక్కడ, ఎందుకు చెడింది... ? నెల తిరక్కుండానే రిజర్వు బ్యాంకు బోర్డు సమావేశం జరుపడంలో ఆంతర్యమేమిటి...? బోర్డు సమావేశం తర్వాత ఊర్జిత్ పటేల్ పదవిలో ఉంటారా... వైదులుగుతారా...?

అక్టోబర్ 23న జరిగిన ఆర్ బిఐ బోర్డు సమావేశమే కేంద్రానికి కోపం తెప్పించింది. సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకోకుండా అర్ధంతరంగా ముగించడంపై ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వం లేవనెత్తిన కొన్ని అంశాలకు ఆర్ బిఐ పరిష్కారం చూపాల్సి ఉంది. వాటిని పట్టించుకోకపోవడంతో కేంద్రం ఆర్థిక రిజర్వ్ బ్యాంకు చట్టంలోని సెక్షన్ 7 ను ప్రయోగించడానికి కేంద్రం సిద్ధమైంది. FSDC సమావేశంలో ఈ విషయం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఊర్జిత్‌ పటేల్ తెలిపినట్లు తెలిసింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ వితరణను పెంచడం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల లిక్విడిటీ సంక్షోభానికి తీసుకోవాల్సిన చర్యలపై రిజర్వ్ బ్యాంక్ గత నెల జరిగిన సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ, బోర్డు సభ్యులు ఈ అంశాలను లేవనెత్తే లోపే సమావేశాన్ని అర్ధంతరంగా ముగించడం ప్రభుత్వం నామినేట్ చేసిన బోర్డు సభ్యులను దిగ్బ్రాంతికి గురిచేసింది.

రిజర్వ్ బ్యాంక్ బోర్డులో గవర్నర్, నలుగురు డిప్యూటీ గవర్నర్లతో సహా ప్రభుత్వం నామినేట్ చేసిన పది మంది నాన్ అఫీషియల్ డైరెక్టర్లు ఉన్నారు. ఆర్బీఐ ప్రాంతీయ బోర్డుల నుంచి మరో నలుగురు డైరెక్టర్లతో కలిపి మొత్తం 19 మంది బోర్డులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 19న జరిగే సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ అఫీషియల్ డైరెక్టర్లు, ప్రభుత్వం నామినేట్ చేసిన కొంత మంది నాన్ అఫీషియల్ డైరెక్టర్లకు మధ్య తీవ్ర వాదోపవాదాలకు తెరతీయనుంది. వివాదాస్పద అంశాలపై కచ్ఛితమైన తీర్మానం కోసం నాన్ అఫీషియల్ డైరెక్టర్ల ద్వారా ప్రభుత్వం బోర్డుపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వడ్డీరేట్లను తగ్గించడం, ఎంఎస్‌ఎంఈ సంస్థలకు రుణ వితరణను పెంచడంపై నాన్ అఫీషియల్ డైరెక్టర్లు ఒత్తిడి తీసుకువస్తే ఆర్భీఐ డైరెక్టర్లు ప్రతిష్టకు భంగంగా భావించే అవకాశాలుంటాయి. మొండిబకాయిలు పేరుకుపోయి బలహీన బ్యాంకులపై రిజర్వ్‌బ్యాంక్ ప్రయోగించిన పీసీఏ నిబంధనలను కూడా సడలించాలని ప్రభుత్వం ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.

దీనికి తోడు బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళనం చేయడం కోసం కొంతకాలంగా రిజర్వ్‌బ్యాంకు అడుగుతున్న అదనపు అధికారాల వినతిని కేంద్రం నిరాకరిస్తూ వస్తున్నది. లిక్విడిటీ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రిజర్వ్‌బ్యాంక్ స్పందిస్తున్న తీరు కేంద్రానికి నచ్చడం లేదు. కాగా, కోరి తెచ్చి పెట్టుకున్న ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని కేంద్రం భావిస్తున్నట్టు ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. అందుకే ఎన్నడూ ప్రయోగించని సెక్షన్ 7 ను తెరపైకి తీసుకువచ్చినట్టుగా భావిస్తున్నారు. నవంబర్ 19న జరిగే బోర్డు సమావేశంలో జరిగే పరిణామాలతో గవర్నర్ ఊర్జిత్ పటేల్ ఉంటారా? ఊడుతారా? అనేది తేలిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories