అసభ్య చేష్టలకు పాల్పడుతున్నాడంటు మామపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కోడలు

Submitted by nanireddy on Fri, 10/12/2018 - 09:44
uncle-harassment-daughter-law-warangal

రోజురోజుకు మానవ సంబంధాలను కొందరు వ్యక్తులు మంటగల్పుతున్నారు. కోడలిని తండ్రిలా చూసుకోవాల్సిన  మామ ఆమెపైనే కన్నేశాడు. వరంగల్ జిల్లాలోని చిర్రకుంట తండా చెందిన బానోతు అనిత అనే మహిళ తండాలో కూలీ పనిచేసుకుంటూ జీవిస్తోంది. గత ఆరునెలలుగా అనిత భర్త కొద్దిరోజులుగా పని నిమిత్తం వేరే ఊరికి వెళ్ళాడు.  ఆమె మామ మంజ్య మద్యానికి బానిససై ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. కొడుకు ఇంటి వద్ద లేకపోవడంతో అనితను శారీరకంగా లొంగదీసుకునేందుకు యత్నించాడు మంజ్య . మామ ప్రవర్తనతో విసుగు చెందిన అనిత స్థానిక పోలీసులకు ఫిర్యా దు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

English Title
uncle-harassment-daughter-law-warangal

MORE FROM AUTHOR

RELATED ARTICLES