తెలంగాణలో టీఆర్టీ పరీక్షలు ప్రారంభం

x
Highlights

ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిసున్న టీఆర్టీ పరీక్ష ప్రారంభమైంది. రోజుకు రెండు పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలిసారి ఉపాధ్యాయ...

ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిసున్న టీఆర్టీ పరీక్ష ప్రారంభమైంది. రోజుకు రెండు పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలిసారి ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ పరీక్షల్ని ఆన్ ‌లైన్ లో నిర్వహిస్తున్నారు. పరీక్ష మొదలవ్వడానికి 45 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్‌లో ఉండాలనే నిబంధన అమల్లో ఉండడంతో అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెట్టారు. 45 నిమిషాల తర్వాత అభ్యర్థుల్ని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో కొందరు కన్నీళ్ళ పర్యతమయ్యారు. ఎంతో కష్టపడి చదివితే పరీక్షకు అనుమతించలేదని వాపోయారు.

8 వేల 792 టీచర్ పోస్టుల కోసం 2 లక్షల 77 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఐదు విభాగాల్లోని పోస్టులకు 48 క్యాటగిరీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం పరీక్ష ఉంటుంది. పరీక్ష రాసేందుకు ఆయా సెంటర్లలో 20 నుంచి 30 వేల కంప్యూటర్లను సిద్ధంచేశారు. ఈ నెల 25వ తేదీన జరిగే ఎస్జీటీ, మార్చి 4న జరిగే స్కూల్ అసిస్టెంట్ మినహా అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories