మోడీపై అవిశ్వాసం... చంద్రబాబుకు కేసీఆర్ ఝలక్

మోడీపై అవిశ్వాసం... చంద్రబాబుకు కేసీఆర్ ఝలక్
x
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఝలక్ ఇచ్చారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వలేదు. బుధవారం ఉదయం టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదం తెలిపారు. ప్రశ్నోత్తరాల తర్వాత టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, తోట నర్సింహం, కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చిన నోటీసులు అందాయని స్పీకర్ తెలిపారు.

అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపేవారు లేచి నిలబడాల్సిందిగా స్పీకర్ కోరగా అనేక పార్టీల ఎంపీలు తీర్మానానికి మద్దతు తెలిపుతూ తమ స్థానాల్లో లేచి నిలబడ్డారు. మద్దతు తెలిపిన వారిలో కాంగ్రెస్ పార్టీతో పాటు సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, ఆప్, ఎస్పీ, ఎన్సీపీ, టీఎంసీ, ఆర్జేడీ పార్టీ ఉన్నారు. దాదాపు 50మందికిపైగా ఎంపీలు లేచి నిలబడి టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించారు. కాగా టీడీపీ అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్‌కు చెందిన ఎంపీలు మద్దతు ఇవ్వలేదు. తీర్మానానికి మద్దతు ఇచ్చే అంశంపై పార్టీ అధినేత కేసీఆర్ తమకు ఆదేశాలు ఇవ్వలేదని ఎంపీలు చెబుతున్నారు. మరోవైపు ఎంఐఎం తరపున ఒకేఒక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా లేచి నిలబడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories