ఆస‌క్తి రేపుతున్న‌ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ ట్రైల‌ర్...

Submitted by arun on Thu, 09/27/2018 - 13:22

బాలీవుడ్‌లో థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ మూవీ  ట్రైల‌ర్ దుమ్మురేపుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించిన ఈ మూవీలోని  థ్రిల్లింగ్‌ సీన్స్, యుద్ధసన్నివేశాలు  ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉన్నాయి. యాక్షన్ అడ్వంచరస్ చిత్రంపై భారీ హోప్స్ నెలకొన్నాయి. మూవీలో అమీర్‌, బిగ్‌బి అమితాబ్‌  కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ గెట‌ప్స్ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ జోరుగా జ‌రుగుతోన్న ఈ మూవీ దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 8న చిత్రం విడుద‌ల కానుంది. 

అందరినీ ఆశ్చర్య పరుస్తూ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కళ్లు చెదిరేలా యాక్షన్లు చేస్తూ కనిపించారు. అమితాబ్ బచ్చన్‌ను యుద్ధ వీరుడిగా చూపించారు. నౌకలపై కత్తి యుద్ధాలు చేస్తూ బిగ్ బి ప్రేక్షకులను మెస్మరైజ్  చేశారు. ఇప్పటి వరకు అభిమానులు చూడని  న్యూ లుక్‌ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కనిపించారు. ఫిరంగి ముల్లాహ్ రోల్‌లో కనిపించి అదరహో అనిపించారు.  గ్లామర్ లేడీగా కత్రినా కైఫ్ కుమ్మేసింది. ఫాతిమా సనా సేక్ ఈచిత్రంలో థగ్స్ తరుపున పోరాడే వీరవనితగా కనిపించబోతోంది.
 

English Title
Thugs Of Hindostan Trailer

MORE FROM AUTHOR

RELATED ARTICLES