సీఎం కేసీఆర్‌కు గుడి కట్టిన కానిస్టేబుల్

Submitted by arun on Sat, 09/22/2018 - 14:11
kcrtemple

సీఎం కేసీఆర్‌పై అభిమానంతో ఏకంగా ఆయనకు గుడినే కట్టేశారు నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన గోగుల శ్రీనివాస్‌. కేసీఆర్‌ అంటే తమకెంతో అభిమానమని చెబుతున్నారు శ్రీనివాస్‌. కానిస్టేబుల్‌గా పనిచేసే శ్రీనివాస్‌ సొంత ఖర్చులతో తన అభిమాన నేతకు గుడికట్టించాడు. సుమారు రెండు లక్షల రూపాయల ఖర్చుతో తన ఇంటి పక్కనే కేసీఆర్ కు గుడిని నిర్మించాడు. ఖమ్మం జిల్లా కల్లూరులో 25 వేలతో కేసీఆర్‌ విగ్రహాన్ని తయారు చేయించాడు శ్రీనివాస్. కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు.. అన్ని వర్గాలకూ మేలు చేస్తున్నాయని చెప్పాడు. తనకు కేసీఆర్‌ రాముడు, కృష్ణుడితో సమానమనీ, అందుకే ఆయనకు గుడి నిర్మించి అభిమానాన్ని చాటుకుంటునాని  శ్రీనివాస్ తెలిపాడు. త్వరలో ముహూర్తం చూసుకొని విగ్రహ ప్రతిష్ఠ చేస్తానన్నాడు. తానుండే ఇల్లు రేకులదే అయినా కేసీఆర్ గుడికి మాత్రం శ్లాబు వేసి, రంగులద్ది అందంగా తీర్చిదిద్దాడు ఈ వీరాభిమాని.

Temple for cm kcr in nalgonda district

English Title
Temple for cm kcr in nalgonda district

MORE FROM AUTHOR

RELATED ARTICLES