ఓటరు జాబితాలో గుత్తా జ్వాల పేరు గల్లంతు

Submitted by arun on Fri, 12/07/2018 - 11:15
gutta

 ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంపై ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు శుక్రవారం ఉదయం ఆమె పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. అక్కడ జాబితాలో తన పేరు కన్పించకపోవడంతో ట్విటర్‌ వేదికగా జ్వాలా అసహనాన్ని వెళ్లగక్కారు. ‘ఆన్‌లైన్‌లో చెక్‌ చేసినప్పుడు నా పేరు ఉంది. ఓటర్ల జాబితాలో పేరు కన్పించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇలా జాబితాలో ఓటర్ల పేర్లు లేనప్పుడు ఎన్నికలు ఎలా పారదర్శకంగా జరుగుతాయి’ అని జ్వాలా ట్వీట్‌లో ప్రశ్నించారు.

English Title
Telangana election: Jwala Gutta says her name is missing from voters' list

MORE FROM AUTHOR

RELATED ARTICLES