ఆపద్ధర్మ టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు షాకిచ్చిన ఈసీ

x
Highlights

తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్‌ పడింది. ఎన్నికల కోడ్‌ కారణంగా చీరల పంపిణీకి ఈసీ అనుమతి నిరాకరించింది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం...

తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్‌ పడింది. ఎన్నికల కోడ్‌ కారణంగా చీరల పంపిణీకి ఈసీ అనుమతి నిరాకరించింది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతున్నందున చీరల పంపిణీని నిలిపివేయాలంటూ విపక్షాలు ఫిర్యాదు చేయడం కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

ఆపద్ధర్మ టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు ఈసీ షాకిచ్చింది. బతుకమ్మ చీరల పంపిణీకి అనుమతి నిరాకరించింది. ఎన్నికల ముందు బతుకమ్మ చీరల పంపిణీ, రైతుబంధు పథకాలను నిలిపివేయాలంటూ విపక్షాలు ఫిర్యాదు చేయడంతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. అయితే బతుకమ్మ చీరల పంపిణీకి ఈసీ అనుమతి నిరాకరించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ప్రకటించారు. బతుకమ్మ పండగ కానుకగా ఈనెల 12నుంచి చీరల పంపిణీకి ఆపద్ధర్మ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 280 కోట్ల వ్యయంతో 95లక్షల చీరలను సిద్ధంచేసింది. అయితే ఎన్నికల కోడ్‌ కారణంగా ఈసీ తీసుకున్న నిర్ణయంతో బతుకమ్మ చీరల పంపిణీ నిలిచిపోనుంది.

తెలంగాణ ప్రజలు పేదరికంలో ఉన్నా తిండిలేక ఇబ్బందిపడుతున్నా అత్మగౌరవంతో బతుకుతారన్న కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ బతుకమ్మ చీరలతో ఓటర్లను ప్రభావితం చేయాలని టీఆర్‌ఎస్‌ చూస్తోందని ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ కారణంగా బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్‌ పడటంతో... రైతుబంధు చెక్కుల పంపిణీపైనా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అయితే రైతుబంధు చెక్కుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories