ఎవరు గెలిచినా డిసెంబర్ 12నే ప్రమాణ స్వీకారం

ఎవరు గెలిచినా డిసెంబర్ 12నే ప్రమాణ స్వీకారం
x
Highlights

కొద్ది గంటలు మరి కొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల ఫలితం వచ్చేస్తోంది. ఆ తర్వాత ఇంకొద్ది గంటల్లో తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి పీఠం ఎక్కేస్తారు....

కొద్ది గంటలు మరి కొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల ఫలితం వచ్చేస్తోంది. ఆ తర్వాత ఇంకొద్ది గంటల్లో తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి పీఠం ఎక్కేస్తారు. సింహాసనం అధిరోహించేది ఎవరైనా ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని మాత్రం రెండు పార్టీలు ఒకే రోజు ఫిక్స్ చేసేసుకున్నాయి. ఎవరు గెలిచినా ఫలితాలు వచ్చిన మరుసటి రోజు అంటే ఎల్లుండే పట్టాభిషేకం జరగబోతోంది,

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఒకవైపు ఉత్కంఠ రేపుతోంటే మరోవైపు రెండు ప్రధాన పార్టీలు ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని ఫిక్స్ చేసేసుకున్నాయి, టీఆర్ఎస్ , ప్రజా కూటమిలో ఎవరు గెలిచినా ఎన్నికల ఫలితలు వెలువడిన మరుసటి రోజు అంటే డిసెంబర్ 12నే ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమయ్యాయి. డిసెంబర్ 12న మంచి ముహూర్తం ఉండడంతో ఆరోజునే పట్టాభిషేకం నిర్వహించేలా ఆయా పార్టీలు దృష్టిసారించాయి.


తెలంగాణ ఎన్నికల్లో ప్రజా ఫ్రంట్‌ మెజారిటీ సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటు అవకాశాన్ని పొందితే ఫ్రంట్‌లోని ప్రధాన పార్టీ కాంగ్రెస్‌కే ముఖ్యమంత్రి పదవి లభిస్తుంది. ప్రజా ఫ్రంట్‌కు మెజార్టీ సీట్లు వచ్చిన వెంటనే కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సీఎల్పీ నాయకుడిని ఎన్నుకుంటారు. కొత్త సీఎల్పీ నేత తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేస్తారని ఇప్పటికే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటించారు కూడా. కానీ.. నాలుగు పార్టీల కూటమి మధ్య మంత్రి పదవుల పంపకం జరగాల్సిన ఉన్న కారణంగా మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మరోసారి ఉంటుందని సమాచారం. అయితే ప్రజా ఫ్రంట్‌‌కు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ సొంతంగానే మేజిక్‌ ఫిగర్‌ సాధిస్తుందా..? లేదంటే ఫ్రంట్‌లోని అన్ని పార్టీలూ కలిసి మేజిక్‌ ఫిగర్‌ను దాటుతాయా అనే అంశం ఆధారంగా మంత్రి పదవుల పంపకం ఆధారపడి ఉంటుంది.

ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం పొందితే కేసీఆరే మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఈ నెల 12న జరుగుతుందని సమాచారం. 12వ తేదీ బుధవారం పంచమి మంచి రోజు కావడం, సమీప భవిష్యత్తులో మంచి రోజులు లేకపోవడంతో రెండు పార్టీలూ 12వ తేదీనే ముహూర్తంగా ఎంచుకున్నాయి. అయితే సీఎంగా కేసీఆర్‌తోపాటు పరిమిత సంఖ్యలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో తలపతుడున్న మంత్రుల్లో ఎవరెవరు గెలుస్తారు విజయం సాధించిన వారికి మళ్ళీ మంత్రి పదవులు దక్కుతాయా అనేది సస్పెన్స్‌ గా మారింది. ప్రమాణ స్వీకారం ముహూర్తం సంగతి ఎలా ఉన్నా ఆ అవకాశం ఎవరికి వస్తుందనే ఉత్కంఠ రేపుతోంది. విషయం తేలాలంటే మరికొద్ది గంటలు ఆగక తప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories