హైకోర్టుకు చేరిన తన్విత వ్యవహారం

Highlights

చిన్నారి తన్విత వివాదం హైకోర్టుకు చేరింది. పెంపుడు తల్లి స్వరూప హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. తన్వితను చైల్డ్‌వెల్ఫేర్‌కమిటీలో ఉంచడం చట్ట...

చిన్నారి తన్విత వివాదం హైకోర్టుకు చేరింది. పెంపుడు తల్లి స్వరూప హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. తన్వితను చైల్డ్‌వెల్ఫేర్‌కమిటీలో ఉంచడం చట్ట విరుద్ధమన్న స్వరూప చిన్నారిని హైకోర్టులో ప్రవేశపెట్టాలని కోరింది. పెంపుడు తల్లి పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. చైల్డ్‌వెల్ఫేర్‌కమిటీ, పోలీసులు, కన్నతల్లి ఉమకి నోటీసులిచ్చింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

తన్విత నాలుగేళ్ల చిన్నారి. ఇద్దరు తల్లలు ఉన్న బంగారు తల్లి. ఏ బిడ్డకు లేని అదృష్టం ఆ చిన్నారిని వరించినా విధి మాత్రం జాలి చూపలేదు. నాలుగేళ్లు పెంచిన తల్లి ఒడిలో గడిపిన చిన్నారిని బాలసదన్‌లో చేర్పిచింది. గోరు ముద్దులు మాయమయ్యాయి. అయినవాళ్ల ఆలనా పాలనా కరువైంది. ముద్దు చేసేవాళ్లు కనిపించకపోవడంతో డీలా పడిపోయింది. ఆ చిట్టి తల్లిని ఓ తల్లి ఒడికి చేర్చే వరకు హెచ్ఎంటీవీ తన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటుంది.

ఇద్దరు తల్లల పోరాటంతో 44 రోజులుగా తల్లి ప్రేమకు దూరమై బాలసదన్‌లో గడుపుతోంది చిన్నారి తన్విత. ఆడపిల్ల పుట్టిందంటే ముఖం చిట్లించుకునే రోజుల్లో కావాలని ఆడపిల్లను తెచ్చుకుని పెంచుకుంది స్వరూప. కళ్లు తెరవని పసిగుడ్డుకు అన్ని తానై సేవలు చేసింది. కానీ నెలన్నర రోజులుగా ఆ తల్లి నిద్రలేని రాత్రులు గడుపుతోంది. తన్విత ముద్దు ముద్దు మాటలు వినాలని ఆరాటపడుతోంది. తన బిడ్డ మళ్లీ ఇంటికి వచ్చి సందడి చేయాలని కనిపించిన ప్రతి దేవుడ్ని మొక్కుతోంది ఆ అభాగ్యురాలు. మరోవైపు కన్న తల్లి మాత్రం ఎక్కడ ఉందో ఏం చేస్తుందో బయటి ప్రపంచానికి మాత్రం తెలియడం లేదు.

తన్విత ఇష్యూపై మొదటి నుంచి హెచ్ఎంటీవీ నాన్ స్టాప్ కవరేజీ ఇస్తోంది. అక్టోబర్ 23న చిన్నారి తన్విత ఉదంతం వెలుగుచూసిన వెంటనే హెచ్ఎంటీవీ అలెర్ట్ అయింది. ప్రతి దృశ్యాన్ని ప్రజల ముందుంచుతోంది. ఇద్దరు తల్లుల కన్నీటి వెతలను, తల్లికి దూరమైన చిన్నారి రోదనలను ఎప్పటికప్ప్పుడు మీకందిస్తోంది. పాప కోసం ఇద్దరు తల్లులు రోడ్డెక్కిన క్షణం నుంచి ప్రతి అప్‌డేట్‌‌ను ప్రసారం చేస్తోంది. బాలల సదనంకు చేరిన తన్వితను పలకరించి కన్నీళ్లు తుడవడంతో పాటు ఓదార్పును కలిగిస్తోంది.

వారం రోజుల్లో కేసు తేలిపోతుందని మహబూబాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి స్వయంగా చెప్పారు. కానీ రెండు నెలలు కావస్తున్నా.. ఇంకా ఈ కేసు ఓ కొలిక్కి రాలేదు. చిన్నారి తన్వితకు మాత్రం విముక్తి కలగలేదు. అందరి పిల్లల్లా స్వేచ్చగా తిరిగేది ఎప్పుడు..? మరి ఎందుకు ఇంత ఆలస్యమవుతోంది..? విచారణ ఎప్పటికి పూర్తవుతుంది..? అసలు తన్విత ఎప్పుడు అమ్మ ఒడికి చేరుతుంది...? ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రశ్నగానే మిగిలిపోతున్నాయి...?

Show Full Article
Print Article
Next Story
More Stories