ఆ అగ్రనటుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్ తనుశ్రీ దత్తా

Submitted by nanireddy on Sun, 10/07/2018 - 07:22
tanushree-dutta-files-police-complaint-against-nana-patekar

బాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ మంటలు రగులుతూనే ఉన్నాయి. నటుడు నానా పటేకర్‌ పై హీరోయిన్ తనుశ్రీ దత్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను వేధించారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయంపై ముంబై (పశ్చిమ) ఏసీపీ మనోజ్‌ మాట్లాడుతూ.. 'నటి తనూశ్రీ శనివారం నానా పటేకర్‌పై మాకు ఫిర్యాదు అందజేశారు. ఈ కేసులో ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు' తెలిపారు. కాగా ప్రస్తుతం జోథ్‌పూర్‌లో హౌస్‌ఫుల్‌–4 సినిమా షూటింగ్‌ లో పాల్గొని ముంబై చేరుకున్న నానా పటేకర్‌ తనుద్రి ఫిర్యాదుపై స్పందిస్తూ..'ఆమె ఆరోపణ అసత్యమని పదేళ్ల క్రితమే చెప్పా' ఇప్పుడు అదే చెప్పననని అని అన్నారు. క్షమాపణ చెప్పాలంటూ తనూశ్రీకి ఇప్పటికే ఆయన లీగల్‌ నోటీసు పంపిన సంగతి తెలిసిందే. 2008లో ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో నానాపటేకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా సెక్సువల్ గా వేధించే ప్రయత్నం చేశాడని తనూశ్రీ ఆరోపించింది. 

English Title
tanushree-dutta-files-police-complaint-against-nana-patekar

MORE FROM AUTHOR

RELATED ARTICLES