రోగనిరోధక శక్తిని పెంచే శృంగారం

Submitted by lakshman on Sat, 03/31/2018 - 04:26
Surprising Health Benefits of Sex

భార్యాభర్తల మధ్య తరచూ శృంగారం అవసరమా... అంటే అవుననే చెబుతున్నారు ప్రముఖ నిపుణులైన మైఖేల్ వెయనర్ డేవిస్. దీనివల్ల భార్యాభర్తలు ఆనందంగా ఉండటమే కాదు, ఆరోగ్యంగానూ ఉంటారట. వాళ్ల మధ్య గాఢమైన బంధం అల్లుకుంటుంది. బాధ్యత పెరుగుతుంది. ఇద్దరిలో ఆత్మవిశ్వాసం పెరిగి, ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఒత్తిడికీ, అలసటకీ కారణమయ్యే కార్టిసాల్ లాంటి హార్మోన్ల స్రావం తగ్గి, ప్రశాంతంగా ఉంటారు.
 
భార్యాభర్తలలో చిన్నచిన్న మనస్పర్థలు వచ్చినా వెంటనే సర్దుకుపోతుంటారట. డిప్రెషన్, ఆందోళన దరిచేరవు. శృంగారం వల్ల విడుదలయ్యే ఎండార్పిన్లు ఆనందంగా ఉండేలా చేస్తాయి. దాంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. హృద్రోగాలని, ఇన్పెక్షన్లని, బీపీని జీర్ణాశయ సమస్యలనీ, ప్రొస్టేట్ క్యాన్సర్‌ని నిరోధిస్తుంది.
 
మనస్పూర్తిగా శృంగారంలో పాల్గొనే భార్యాభర్తల్లో ఒకరిమీద ఒకరికి అంతులేని ప్రేమ ఉంటుందట. మానసికమైన ఒత్తిడిని తగ్గించడమే కాక మంచి నిద్ర పట్టేలా చేస్తుందనీ, మూత్రాశయ సమస్యల్నీ నిరోధిస్తుందనీ నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అంతేకాదు మానసికంగా ఆందోళనగా ఉన్న వ్యక్తిని ఆప్యాయంగా కౌగిలించుకుంటే వారి బాధ ఇట్టే మాయమవుతుందట. ప్రేమగా ఇచ్చే కౌగిలితో ఆరోగ్యం సిద్ధిస్తుందని పరిశోధనలో తేలింది. ఆరోగ్య లాభం.. కౌగిలిలో ఒదిగిపోయిన పురుషుల కన్నా మహిళలకే ఎక్కువగా ఒనగూరుతుందని అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. కౌగిలిలో తలదాచుకున్నప్పుడు స్త్రీ-పురుషులిద్దరి శరీరీంలోనూ ఆరోగ్యానికి మేలు చేసే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయని, వాటి ప్రభావంతో మానసిక సమస్యలు దూరమవుతాయని తెలిసింది. 
 
ఆలింగనం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుందట. దీర్ఘ కౌగిలిలో.... మెదడు చురుకుగా పనిచేయడమే కాకుండా ఇతర శరీర అవయవాలకు పాజిటివ్ వైబ్రేషన్స్ పంపిస్తుందట. కౌగిలి సమయంలో ఫీల్ గుడ్ హార్మోన్లుగా పేరున్న డొపమైన్, సెరోటోనిన్ విడుదలవుతాయని పరిశోధకులు వెల్లడించారు. మూడ్‌ని మార్చడంలో ఈ హార్మోన్లు కీలకంగా పనిచేస్తాయి. ఒంటరిగా ఉన్నామన్న భావన ఏమైనా ఉంటే.... ఆలింగనంతో అది దూరమవుతుందట. మొత్తానికి కౌగిలింతలో ఆరోగ్యానికి మేలు చేసేవి ఉన్నాయని తేలింది.
 

English Title
Surprising Health Benefits of Sex

MORE FROM AUTHOR

RELATED ARTICLES