శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌

శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌
x
Highlights

రెండు రోజులుగా సంచలన తీర్పులు వెల్లడిస్తూ వస్తోన్న సుప్రీంకోర్టు నేడు కూడా మరో కీలక తీర్పు వెలువరించింది. ఏ వయసు మహిళలైనా శబరిమల ఆలయంలోకి...

రెండు రోజులుగా సంచలన తీర్పులు వెల్లడిస్తూ వస్తోన్న సుప్రీంకోర్టు నేడు కూడా మరో కీలక తీర్పు వెలువరించింది. ఏ వయసు మహిళలైనా శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని, ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పుపై మహళాసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై గల నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నెలసరి సమస్యల కారణం చూపుతూ 10 నుంచి 50 ఏళ్ళ మధ్య వయస్సుగల మహిళలు ఈ ఆలయంలోకి ప్రవేశించడంపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ జరిపి ఇచ్చిన తుది తీర్పుపై మహిళ లోకంతో యావత్‌ దేశం హర్షం వ్యక్తం చేస్తున్నారు

మహిళలను దేవతలుగా పూజించే ఈ దేశంలో గుడుల్లో వారి ఎంట్రీకి నిషేధం విధించడం సరికాదని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. పురుషులతో పోలిస్తే మహిళలు దేనిలోనూ బలహీనులు కాదని ఆలయాల్లో లింగ వివక్షకు తావు లేదని స్పష్టం చేసింది. నలుగురు న్యాయమూర్తులతో కూడిన ఈ బెంచ్‌లో ముగ్గురు ఈ తీర్పుతో ఏకీభవించగా, జస్టిస్ ఇందు మల్హోత్రా మాత్రం విభేదించారు. కాగా-ఈ తీర్పుపై స్పందించిన ట్రావన్ కోర్ దేవస్థానం బోర్డు చైర్మన్.ఎ.పద్మకుమార్..దీన్ని పునసమీక్షించాలని కోరుతూ పిటిషన్ వేస్తామని తెలిపారు.

మహిళలపై ఆంక్షలు విధించడం సరికాదని సుప్రీ తేల్చడం సంతోషంగా ఉందన్నారు మహిళామణులు. దేవుడి ముందు అంతా సమానం అయినప్పుడు శారీక అంశాల ఆధారంగా మహిళలపై నిషేధం ఎలా విధిస్తారని ప్రశ్నించారు. సుప్రీం కూడా తమకు సపోర్టుగా నిలవడం హ్యాపీగా ఉందంటున్నారు. సుప్రీం తీర్పుతో ఆలయాల్లో లింగ వివక్షకు తావు లేదని మహిళలను తక్కువగా బలహీనులుగా చూడడానికి వీల్లేదని దేవుడిని ప్రార్థించే హక్కు అందరికీ ఉందంటున్నారు పలువురు. ఇటు సుప్రీంకోర్టు తీర్పును అంగీకరిస్తామని దేవస్థానం బోర్డు తెలిపింది. దీనిపై రివ్యూ పిటిషన్ వేయబోమని చెప్పింది. అయ్యప్ప స్వామిపై భక్తితో మహిళలు రావాలని భావిస్తే వారిని స్వాగతిస్తామని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories