‘జిగేల్‌ రాణి’ గాయనికి ఎంత పారితోషికం ఇచ్చారంటే...

x
Highlights

రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి పాట పాడిన...సింగర్ వెంకటలక్ష్మికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. రెమ్యూనరేషన్ విషయంలో..మధ్యవర్తుల చేతిలో మోసపోయిన...

రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి పాట పాడిన...సింగర్ వెంకటలక్ష్మికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. రెమ్యూనరేషన్ విషయంలో..మధ్యవర్తుల చేతిలో మోసపోయిన వెంకటలక్ష్మికి డైరెక్టర్ సుకుమార్ అండగా నిలబడ్డాడు. పెద్దమొత్తంలో ఆర్థికసాయం చేశాడు. వారం రోజులుగా వెంకటలక్ష్మికి న్యాయం చేసేందుకు..హెచ్ఎంటీవీ చేసిన ప్రయత్నం చివరికి ఫలించింది.

ఈమె పేరు గంటల వెంకటలక్ష్మి ఊరు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి. వృత్తిపరంగా బుర్రకథా కళాకారిణి అయిన వెంకటలక్ష్మి ఆర్థిక పరిస్థితి చాలా దయనీయం. భర్త పదిహేనేళ్ల క్రితమే చనిపోవడంతో చిన్న కిరాణా కొట్టు నడుపుకుంటూ కూతురిని చదివించుకుంటోంది. ఎక్కడో మారుమూల గ్రామంలో నివసిస్తూ ఎవరికీ తెలియని ఈమె సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ రంగస్థలం సినిమాలో ఆడియన్స్ ని ఎంతగానో అలరించిన జిగేల్ రాణి పాటని పాడింది.

ఎక్కడో పల్లెల్లో బుర్రకథలు చెప్పుకునే వెంటకలక్ష్మిలోని టాలెంట్ ని మొదట గుర్తించింది డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాదే. మట్టిలో మాణిక్యాన్ని సానబెట్టారు. వెంకటలక్ష్మిని ప్రోత్సహించి రంగస్థలం సినిమాలో ఐటం సాంగ్ ని పాడించారు. వెంకటలక్ష్మి గాత్రానికి తెలుగు ఆడియన్స్ నుంచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. రంగస్థలం సినిమాలో అన్ని పాటలు ఒకెత్తయితే జిగేల్ రాణి పాట ఒక్కెత్తు అనేలా రెస్పాన్స్ వచ్చింది.

రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది వంద రోజుల పండుగ జరుపుకుంది. కానీ సినిమాలో అంత సూపర్ హిట్ పాట పాడిన వెంకటలక్ష్మికి అన్యాయం జరిగింది. సినిమాలో పాట పాడేందుకు వెంకటలక్ష్మిని మూవీటీం దెగ్గరికి తీసుకెళ్లిన మధ్యవర్తులు మోసం చేశారు. పాట పాడినందుకు ఇచ్చిన రెమ్యూనరేషన్ మొత్తం మధ్యవర్తులే స్వాహా చేసేశారు.

తన ఆవేదనని ఎవరికి చెప్పుకోవాలో తెలియదు తనకు జరిగిన మోసాన్ని ఎవరికి చెబితే న్యాయం జరుగుతుందో తెలియదు అలాంటి పరిస్థితుల్లో వెంకటలక్ష్మి హెచ్ఎంటీవీని సంప్రదించింది. రీసెంట్ గా రంగస్థలం వందరోజుల వేడుక జరిగిన సమయంలో హెచ్ఎంటీవీ ముందు తన గోడు వెళ్లబోసుకుంది. తనకి సరైన గుర్తింపు లభించలేదని వెంకటలక్ష్మి బాధపడింది.

వెంకటలక్ష్మికి జరిగిన అన్యాయాన్ని హెచ్ఎంటీవీ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లింది. స్టార్ డైరెక్టర్ గా ఎంతో బిజీగా ఉండే సుకుమార్ తన సినిమాలో పాట పాడిన ఓ సింగర్ కి అన్యాయం జరిగిందనగానే వెంటనే స్పందించాడు. పాట పాడినందుకు అంతకు ముందే రెమ్యూనరేషన్ ఇచ్చేసినా మధ్యవర్తులు మోసం చేశారని తెలియడంతో వెంకటలక్ష్మిని ఆదుకునేందుకు సుకుమార్ సిద్దమయ్యాడు. హెచ్ఎంటీవీ ద్వారా వెంకటలక్ష్మికి సాయం చేస్తానని హామీ ఇచ్చాడు. డైరెక్టర్ సుకుమార్ మాటలకే పరిమితం కాలేదు..ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. గంటా వెంకటలక్ష్మికి లక్షరూపాయల నగదు పంపించారు. తన చేత పాట పాడించుకుని డబ్బివ్వకుండా మధ్యవర్తి మోసం చేశాడని ఇటీవల వెంకటలక్ష్మి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె వేదన విన్న డైరెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి లక్ష నగదు ఇవ్వడంతో సింగర్ వెంకటలక్ష్మి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories