ప్రాణం తీసిన మాక్‌ డ్రిల్‌...అమ్మాయి భయపడుతున్నా కిందకు నెట్టేసిన ట్రైనర్

x
Highlights

తమిళనాడులో ఓ మాక్‌డ్రిల్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కోయంబత్తూరులోని కోవై కళైమగల్ ఆర్ట్స్ కాలేజీలో ఎన్డీఆర్ఎఫ్ నిర్వహించిన మాక్ డ్రిల్‌ ఓ...

తమిళనాడులో ఓ మాక్‌డ్రిల్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కోయంబత్తూరులోని కోవై కళైమగల్ ఆర్ట్స్ కాలేజీలో ఎన్డీఆర్ఎఫ్ నిర్వహించిన మాక్ డ్రిల్‌ ఓ విద్యార్థిని నిండు ప్రాణాన్ని బలిగొంది. ఇప్పుడీ డెత్ డ్రిల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా బయటపడాలన్న విధానాన్ని స్టూడెంట్స్‌కు తెలియజేసేందుకు ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేశారు. మంచి ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టినా చివరకు విషాదాన్ని మిగిల్చింది. ఈ డెత్ డ్రిల్‌లో బీబీఏ సెకండియర్ స్టూడెంట్ లోకేశ్వరి మృతి చెందింది.

మాక్‌డ్రిల్‌లో భాగంగా తోటి విద్యార్థులు కింద నెట్ పట్టుకొని నిల్చున్నారు. రెండో అంతస్తు నుంచి కిందకి దూకేందుకు విద్యార్థిని లోకేశ్వరి ఎంతో భయపడుతోంది. ఇది విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. కిందకి దూకేందుకు సందేహిస్తుండగా మాక్ డ్రిల్ ట్రైనర్ లోకేశ్వరిని దూకేయ్ పర్వాలేదు నెట్ ఉంది నీకేం కాదు అని ధైర్యం చెప్పాడు. కానీ లోకేశ్వరిలో భయం పోలేదు. ఇంతలోనే ట్రైనర్ విద్యార్థినిని కిందకు నెట్టేశాడు. దీంతో ఆమె తల ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న సైన్ సైడ్‌కు బలంగా తాకింది. మాక్‌ డ్రిల్‌లో తీవ్రంగా గాయపడిన లోకేశ్వరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆ అమ్మాయి మృతి చెందింది. డ్రిల్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించాడన్న ఆరోపణలపై ట్రైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ వీడియోను కాస్త పరిశీలిస్తే లోకేశ్వరి కొంచెం ఫోర్స్‌గా ముందుకు దూకుంటే కింద స్టూడెంట్స్ పట్టుకున్న నెట్‌లో పడేది. అప్పుడు ప్రాణాపాయం తప్పేది. వాళ్లు అనుకున్న మాక్ డ్రిల్ ప్రశాంతంగా పూర్తయ్యేది. కానీ ఇక్కడ అది జరగలేదు. భయపడుతున్న అమ్మాయిని మాక్‌డ్రిల్‌కు సెలెక్ట్ చేసుకోవడమే వాళ్లు చేసిన పెద్ద తప్పు. ఆ అమ్మాయి ధైర్యంగా ముందుకు దూకుంటే ఇంతటి విషాదం జరిగేది కాదు.

ఈ మాక్ డ్రిల్‌లో ట్రైనర్‌ తప్పు కూడా క్లియర్‌గా కనిపిస్తోంది. లోకేశ్వరి భయపడుతుంటే ఆమెను తప్పించి ధైర్యంగా ఉన్న అబ్బాయిలను దూకేందుకు ఎంపిక చేసుకుంటే సరిపోయేది. కానీ అమ్మాయి భయపడుతున్నా దూకేందుకు ప్రోత్సహించడం బలవంతంగా నెట్టేయడంతో నెట్‌లో పడాల్సిన లోకేశ్వరి ఫస్ట్ ఫ్లోర్‌లో సైన్ సైడ్‌కు తగిలింది. తీవ్రంగా గాయపడింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మాక్ డ్రిల్ చూసిన తర్వాత చాలా కాలేజీల్లో ఇలాంటి డ్రిల్స్ చేయడానికి సందేహిస్తారు. విద్యార్థిని లోకేశ్వరి మృతితో.. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విద్యార్థుల ప్రాణాలు రిస్క్‌లో పెట్టే డ్రిల్స్ ఎందుకు చేస్తారని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories