సంచ‌ల‌నం రేపుతున్న శ్రీరెడ్డి తాజా పోస్ట్‌!

Submitted by arun on Wed, 04/18/2018 - 12:31
Sri Reddy

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ మీద చిచ్చు రేపి, చీకటి కోణాలపై ఎలుగెత్తి..పవన్ కళ్యాణ్ నే దుయ్యబట్టిన నటి శ్రీరెడ్డి..ఈ ప్రపంచంలో తాను ఒంటరిగా మిగిలిపోయానని ట్వీట్ చేసింది. ఈ పోరాటంలో తనకు అండగా నిలిచినవారందరికీ ధన్యవాదాలని పేర్కొంది.  తాజాగా శ్రీరెడ్డి త‌న ఫేస్‌బుక్ ఖాతాలో చేసిన కొన్ని పోస్టింగ్స్ సంచ‌ల‌నంగా మారాయి. `జీవితంలో మొద‌టిసారి ఒంటరి అయ్యాను. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు` అని మొద‌ట పోస్ట్ చేసిన శ్రీరెడ్డి.. వెంట‌నే ``ఈ జీవితానికి ఇది చాలు` అంటూ మ‌రో పోస్టింగ్ చేసింది. దీంతో ఈ పోరాటానికి ఇక్క‌డితో ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని శ్రీరెడ్డి భావిస్తోంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. కాగా, ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

English Title
sri reddy latest post

MORE FROM AUTHOR

RELATED ARTICLES