నా భర్తకు సపోర్ట్‌ చేయను.. నానీ భార్యపై శ్రీరెడ్డి ఫైర్..

Submitted by nanireddy on Sun, 06/17/2018 - 10:52
sri-reddy-counter-nani-wife-anjana

క్యాస్టింగ్ కౌచ్ పై టాలీవుడ్ నటుల మధ్య మాటల దుమారం క్రమంగా  పెరుగుతోంది. హీరో నానిపై శ్రీరెడ్డి  వ్యాఖ్యలకు అయన భార్య అంజనా  కౌంటర్ ఇచ్చారు. తాజాగా అంజనా వ్యాఖ్యలపై మండిపడ్డారు శ్రీరెడ్డి. ఆమె తన పేస్ బుక్ ఖాతాలో  ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.  

'హాయ్‌ మిసెస్‌. నేనిప్పుడే నువ్వు చేసిన పోస్ట్‌ను చూశాను. నేను నీ భర్తతో ఉన్నప్పుడు నువ్వు చూడలేదు. నేను పేరు కోసం తాపత్రయపడటం లేదు. నీ భర్తే పేరు కోసం తాపత్రయ పడతాడు. నాకు ఉన్న పేరు చాలు. ఒకవేళ నా భర్తకే పేరు, డబ్బు ఉండి ఇలాంటి పనులు చేస్తే, నేను నా భర్తకు మాత్రం సపోర్ట్‌ చేయను. అవసరమైతే అలాంటి వాడ్ని వదిలేసి వెళ్లిపోతానేమో అంతే కానీ బాధిత మహిళను మాత్రం అవమాన పరచను. ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. మొత్తం విషయం తెలిసేవరకు సైలెన్స్‌గా ఉండండి. నా వైపు సత్యం ఉంది. కర్మ ఉంది. నీ భర్త తప్పకుండా శిక్షను అనుభవించాల్సిందే' అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

English Title
sri-reddy-counter-nani-wife-anjana

MORE FROM AUTHOR

RELATED ARTICLES