కీర్తి సురేష్ నేను గుర్తుంచుకుంటా.. ఆ బాధేంటో అప్పుడు తెలుస్తుంది : నటి శ్రీరెడ్డి

Submitted by nanireddy on Sun, 09/30/2018 - 09:56
sri-reddy-comments-keerthy-suresh

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ నటి శ్రీరెడ్డి రేపిన కలకలం అంతా ఇంతా కాదు. ఆమె ఎప్పుడు ఎవరిమీద మాట్లాడుతుందోనని బెంబేలెత్తిపోతున్నారు. టాలీవుడ్ ప్రముఖులపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలకు దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి  విశాల్ తీవ్రంగా స్పందించారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలి అని ఘాటుగానే స్పందించారు. దాంతో కొన్నిరోజులపాటు విశాల్, శ్రీరెడ్డి కి మధ్య కోల్డ్ వార్ నడిచింది. విశాల్‌ తాను నటించిన సండైకోళి–2 చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై నటి శ్రీరెడ్డికి అవకాశం రావడం ఆహ్వానించదగ్గ విషయం అని అన్నాడు.  ఆమెపై సెటైర్లు పేల్చుతూ విశాల్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఆమెతో నటించేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఆమె తన రక్షణ కోసం కెమెరా దగ్గరే ఉంచుకుంటారని అన్నారు. ఆ మాటలకూ పక్కనే ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్ పక్కున నవ్వింది. దాంతో శ్రీరెడ్డికి ఒళ్ళు మండినట్టుంది. ఈ క్రమంలో విశాల్‌కు థ్యాంక్స్‌ చెబుతూ.. ట్విట్టర్‌లో ఒక ట్వీట్‌ చేసింది. అందులో 'నటి కీర్తీసురేశ్‌ నవ్వడం గురించి పేర్కొంటూ మీ నవ్చు చాలా అసహ్యంగా ఉంది. ఏం చింతించకండి మేడమ్‌ మీరు ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండలేరు. పోరాడేవారి బాధేంటో మీకూ ఒక రోజు తెలుస్తుంది. గుర్తుంచుకోండి. నేనూ మీ నవ్వును మరచిపోను. మీరిప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నట్టున్నారు' అని పేర్కొంది.

English Title
sri-reddy-comments-keerthy-suresh

MORE FROM AUTHOR

RELATED ARTICLES