వివాదంలో మలింగా ...కలకలం రేపుతున్న చిన్మయి పోస్ట్!

Submitted by arun on Thu, 10/11/2018 - 16:32
malinga

బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో  మీటూ’ ఉద్యమం భారత్ లో ఊపందుకుంది. మనవరాలి వయసులో ఉన్నప్పుడే  తనను లైంగికంగా వేధించారంటూ  ప్రముఖ గేయ రచయిత వైరముత్తుపై గాయని చిన్మయి శ్రీపాద తీవ్ర ఆరోపణలు చేసింది. మొదటి నుంచి #మీటూకు మద్దతుగా ఉన్న గాయని చిన్మయి ఈ వ్యవహారానికి సంబంధించి తన ట్విట్టర్‌లో చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. శ్రీలంక క్రికెటర్ లసిత్‌ మలింగాకు సంబంధించిన సంచలన ఆరోపణలు వెలుగులోకొచ్చాయి. మలింగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువతి ఈ రోజు ఆరోపించింది. సదరు ఆరోపణలను గాయని చిన్మయి శ్రీపాద ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

తన వివరాలను గోప్యంగా ఉంచాలని కోరిన బాధితురాలు మలింగా తనతో ఎలా ప్రవర్తించాడో పోస్టులో వర్ణించింది. ‘‘కొన్నేళ్ల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా ముంబైలోని ఓ హోటల్‌లో నా స్నేహితురాలితో కలిసి దిగాను. అదే హోటల్ లో ముంబై ఇండియన్స్ జట్టుతో పాటు శ్రీలంక ఆటగాడు లసిత్ మలింగా కూడా దిగాడు. ఓరోజు నా స్నేహితురాలి కోసం ఎదురు చూస్తుంటే ఒకరు ఆమె మలింగా గదిలో ఉందని చెప్పారు. నేను వెంటనే అక్కడకు వెళ్లాను. అయితే అక్కడ ఎవ్వరూ లేరు. తలుపు తీసిన మలింగా నన్ను బెడ్ పైకి తోసేశాడు. అనంతరం నాపైకి వచ్చి ముఖాన్ని తడిమాడు. అతడిని ప్రతిఘటించే శక్తి లేకపోవడంతో గట్టిగా కళ్లు మూసుకుని ఉండిపోయాను. అప్పుడే హోటల్ స్టాఫ్ వచ్చి డోర్ కొట్టారు. అతను డోర్ ఓపెన్ చేయడానికి వెళ్లాడు. నేను వెంటనే వాష్ రూమ్‌లోకి పరిగెత్తాను. ఫేస్ వాష్ చేసుకుని హోటల్ స్టాఫ్ వెళ్లిన వెంటనే నేను ఆ గదిలో నుంచి వెళ్లిపోయాను. ఈ విషయం నేను బయటకు చెప్తే నువ్వు కావాలనే అతని రూమ్‌కి వెళ్లావు అని నన్ను అవమానిస్తారు. ఈ విషయం గురించి ఎవరికి చెప్పినా ‘నీకు తెలిసే వెళ్లావు’ ‘అతను ఫేమస్ వ్యక్తి కాబట్టే ఇలా మాట్లాడుతున్నావ్’ ‘నవ్వు కావాలనుకునే అతని గదిలోకి వెళ్లావ్ కదా’ అంటూ విమర్శిస్తారని నాకు తెలుసు. అయినా సరే నేను నిజాన్ని బయటపెడుతున్నా’’ అని ట్వీట్  సదరు యువతి ట్వీట్ చేసింది. దీన్ని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది.

English Title
Sri Lankan Cricketer Lasith Malinga Accused of Sexual Harassment

MORE FROM AUTHOR

RELATED ARTICLES