ఆ నొప్పిని భరిస్తూ ఏడ్చేశాను: సోనాలి

Submitted by arun on Tue, 10/09/2018 - 17:35
Sonali Bendre

 స్టార్ హీరోయిన్ సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతూ న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నారు. సోనాలి పరిస్థితి నిలకడగా ఉందని ఆమె భర్త గోల్డీ బెహెల్‌ ఇటీవల తెలిపారు. కాగా, చికిత్స క్రమంలో చాలా నొప్పిని భరిస్తున్నట్లు ఆమె తాజాగా చెప్పారు. తన ఆవేదనను తెలుపుతూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. దీంతోపాటు ఓ ఫొటోను షేర్‌ చేశారు.‘కొన్ని నెలలుగా మంచి, చెడు రెండూ అనుభవిస్తున్నా. చికిత్స జరుగుతుండగా కనీసం నా చేతి వేలు కూడా పైకెత్తలేనంతగా తయారయ్యా. శారీరకంగా మొదలైన ఆ నొప్పి కాస్త మానసికంగా కూడా భాధ పెడుతోంది. కీమో థెరపీ, సర్జరీ జరిగిన తర్వాత కనీసం నవ్వినా కూడా నొప్పి వచ్చేది. ప్రతి నిమిషం నాతో నేను పోరాటం చేస్తూ గడుపుతున్నా. చెడు రోజులు జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తుంటాయి. వాటిని ఎదుర్కొని సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
 
కొన్ని సందర్భాల్లో నొప్పిని భరిస్తూ ఏడ్చేశాను. మనకేం అవుతోందో కేవలం మనకు మాత్రమే తెలుస్తుంది. దాన్ని అంగీకరిస్తేనే మంచిది. భావోద్వేగానికి గురి కావడం తప్పేం కాదు. కొన్నిసార్లు నెగిటివ్‌ ఎమోషన్స్‌‌కి లోనుకావడం కూడా తప్పు కాదు. కాకపోతే ఆ తర్వాత దానిని గుర్తించి ఆ ప్రభావం మనపై పడకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. మా అబ్బాయితో మాట్లాడటం, నిద్రపోవటం ద్వారా ఇవన్నీ మర్చిపోయి కాలం గడుపుతున్నా. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. త్వరలో ఇంటికి వచ్చేస్తా’ అని ఆ పోస్ట్‌లో పేర్కొంది సోనాలి. ఆమె చేసిన ఈ పోస్ట్ చుసిన నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతూ మెసేజీలు పెడుతున్నారు.

English Title
Sonali Bendre on cancer treatment: I allowed myself to cry, to feel the pain

MORE FROM AUTHOR

RELATED ARTICLES