స్మార్ట్‌ఫోన్ల వాడకం టీనేజర్స్‌ బీకేర్‌ఫుల్‌ అంటున్న నిపుణులు

x
Highlights

స్మార్ట్‌‌ఫోన్లు మన జీవితాన్నే మార్చేస్తున్నాయి. ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేస్తున్నాయి. ఇక ఇందులోని ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లతో అయితే ఎక్కడో ఉన్న వారితో...

స్మార్ట్‌‌ఫోన్లు మన జీవితాన్నే మార్చేస్తున్నాయి. ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేస్తున్నాయి. ఇక ఇందులోని ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లతో అయితే ఎక్కడో ఉన్న వారితో లైవ్‌లో మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్, బంధువులు, సహచరులను టచ్‌లో ఉంచుకుంటున్నాం. ఆ బంధమే సామాజిక వల విసురుతోంది. ప్రతీ ఒక్కరితో కనెక్టయిన వాట్సప్‌ గ్రూప్స్‌ శుభోదయం మెసేజ్‌లతో నిండిపోతున్నాయి.

మాటల్లేవ్‌... మాట్లాడుకోవటాల్లేవ్‌... ఓన్లీ మెసేజెస్‌. వాట్సప్‌ అన్న పదం చాలా కామన్‌ అయిపోయింది. లేదపొద్దున లేవడంతోనే వాట్సప్‌. కాస్త టైమ్‌ దొరికితే వాట్సప్‌. ఫ్రెండ్‌నో... రిలేటివ్స్‌నో టచ్‌లోకి తీసుకోవాలంటే వాట్సప్‌. వారితో చాటింగ్‌ చేయాలంటే వాట్సప్‌.. మొత్తంగా ఏంటీ వాట్సప్‌. మనిషి జీవితాన్ని ఎందుకింతలా శాసిస్తుంది వాట్సప్‌.?

శుభోదయం... పొద్దున లేచి వాట్సప్‌ ఆన్‌ చేయగానే మొట్టమొదటి సందేశం. ఈ మెసేజ్‌లతోనే స్మార్ట్‌ఫోన్లు నిండిపోతున్నాయి. ప్రతి ముగ్గురిలో ఒకరికి డెఫినైట్‌గా శుభోదయం మెసెజ్‌ ఉండి తీరాల్సిందే. ముద్దులొలికే చిన్నారులు, పక్షులతో పాటు సూర్యకిరణాల వెలుగుల్లో తళతళ మెరిసే పువ్వులతో శుభోదయ సందేశాలను ఏ వాట్సప్‌లోనైనా కామన్‌గా కనిపించే దృశ్యాలు

లక్షలాది మంది ఉదయం ఆన్‌లైన్‌లోకి వస్తూనే సందేశాలు పంపుతున్నారు. గత ఐదేళ్లలో శుభోదయం చిత్రాల కోసం ఇంటర్‌నెట్‌లో వేట పది రెట్లు పెరిగిందంటే డిమాండ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. వాట్సాప్‌ అనే సామాజిక అనుసంధాన సంస్థ స్టేటస్ అనే కొత్త సదుపాయంతో ఒకేసారి అందరికీ సందేశాలు చెప్పేసే అవకాశం రావడంతో అందరికీ ఎట్‌ ఏ టైమ్‌కి మెసేజ్‌లు వెళ్తున్నాయ్.


స్మార్ట్‌‌ఫోన్లు రానప్పుడు, సోషల్ మీడియాను కంప్యూటర్ల ద్వారానే వాడారు. కానీ స్మార్ట్‌ఫోన్లు వచ్చాక సమస్తమూ అరచేతిలో ఇమిడిపోయింది. ప్రపంచంలో సోషల్ మీడియా అత్యంత బలమైన శక్తిగా అవతరించింది. ముఖ్యంగా వాట్సప్‌తో ప్రపంచావ్యాప్తంగా ప్రతిరోజు కోన్ని కోట్లమంది కనెక్ట్ అవుతున్నారు. స్మార్ట్‌ఫోన్లు వచ్చాక సామాజిక మాధ్యమాలతో మరింత మమేకమయ్యారు జనం.

కానీ టీనేజర్లు స్మార్ట్‌ఫోన్ల వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోయే టీనేజర్లు సంతోషంగా ఉండడంలేదని ఓ సర్వేలో వెల్లడయింది. తోటి వారితో పోలిస్తే ఫోన్‌ ఎక్కువగా వాడే యువత సంతోషంగా ఉండట్లేదట. సామాజిక సంబంధాలు అంతగా పెంచుకోవట్లేదని ఓ పరిశోధనలో తేలింది. ఆటలు ఆడడం, పత్రికలు, మ్యాగజైన్స్‌ చదవడం, నేరుగా ఇతరులతో మాట్లాడుతూ సామాజిక బంధాలను పెంచుకోవడం తదితర పనులకు ఎక్కువ సమయం కేటాయించే వారితో పోలిస్తే.. కంప్యూటర్‌ గేమ్స్‌, సోషల్‌ మీడియా, మెసేజ్‌, వీడియో చాటింగ్‌తో ఎక్కువ సమయం గడుపుతున్న యువత తక్కువ ఆనందంగా ఉంటోందని సర్వే తేల్చిన సత్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories