కన్నీళ్లు పెట్టిన శివాజీరాజా

Submitted by arun on Mon, 02/19/2018 - 11:12
sivaji raja

ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు తీవ్ర అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా హనుమంతరావుకు నివాళులు అర్పించేందుకు బ్రహ్మానందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఎస్సార్‌ నగర్‌లోని ఆయన నివాసానికి వచ్చారు. హనుమంతరావుతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ శివాజీరాజా కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు సన్నిహితుడైన గుండు హనుమంతరావు మరణం కలిచివేసిందన్నారు. ‘అమృతం ధారావాహిక మా ఇద్దరికి చాలా ప్రత్యేకం. చెన్నై నుంచి మా ఇద్దరి ప్రయాణం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో హనుమంతరావు ఇవ్వని ప్రదర్శన లేదు. మూవీ ఆర్ట్‌ అసోసియేషన్‌ ఆయన కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటుంద’ని శివాజీరాజా అన్నారు.
 

English Title
sivaji raja condole gundu hanumanth rao

MORE FROM AUTHOR

RELATED ARTICLES