గుండెపోటు పెళ్లికానివారికే ఎక్కువ‌ట‌

Submitted by lakshman on Wed, 04/11/2018 - 06:21
Single Adults Have Greater Heart Attack Risk

ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. ఇలాంటి వ్యక్తులకు అవసరాలను బట్టి బైపాస్‌ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ చేస్తారు. మళ్లీ బైపాస్‌ సర్జరీ చేయడం రోగికి ప్రమాదకరం. దీనికి ప్రత్యామ్నాయమే ఇఇసిపి. 
అయితే ఈ గుండెపోటు పెళ్లైనవారి కంటే పెళ్లికానివారికే ముప్పు ఎక్కువట. అమెరికా హార్ట్ అసోసియేషన్‌ ఈ విషయం వెల్లడించింది. పెళ్లయిన హృద్రోగులతో పోల్చితే పెళ్లికాని రోగుల్లోనే చనిపోయే ప్రమాదం 40 శాతం ఎక్కువగా ఉందని పేర్కొంది. అమెరికాలోని అట్లాంటాలో ఉన్న ఎమోరే యూనివర్శిటీకి చెందిన మెడిసిన్ ప్రొఫెసర్ అర్షెద్ కుయుమ్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది.

సర్వేలో భాగంగా 6,051 మంది రోగులపై (సరాసరి వయస్సు 63) పరీక్షలు నిర్వహించారు. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్నవారు, విడిపోయినవారు, భర్త లేదా భార్య చనిపోయినవారు, ఎప్పటికీ పెళ్లి చేసుకోని గుండె వ్యాధిగ్రస్తుల్లో చనిపోయే ముప్పు ఎక్కువగా ఉన్నట్లు ఈ సందర్భంగా గుర్తించారు. ఈ పరిశోధన కోసం దాదాపు నాలుగేళ్లపాటు రోగుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. అయితే, ఇప్పటికే గుండె సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు మాత్రమే ఈ ప్రమాదం ఉందని, గుండె సమస్యలు లేని ఒంటరి వ్యక్తులు దీనిపై కలవరం పడక్కర్లేదని సర్వే స్పష్టం చేసింది. అయితే, ఏ కారణం వల్ల పెళ్లికానివారికి ఈ ముప్పు ఉంటుందనేది మాత్రం వివరించలేదు. ఈ నేపథ్యంలో పెళ్లికాని వ్యక్తులు గుండె వ్యాధులు పరీక్షలు చేయించుకోవడం మంచిది.

English Title
Single Adults Have Greater Heart Attack Risk

MORE FROM AUTHOR

RELATED ARTICLES