ప్రేమలోకి దింపి..నడిరోడ్డుపై వదిలేశాడు : శిల్పాశెట్టి

Submitted by arun on Thu, 10/04/2018 - 12:06
Shilpa Shetty

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి తన చిన్నప్పటి లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది. ఓ టీవీ షో సందర్భంగా తన లవ్ స్టోరీని తెలిపిన శిల్పా..  టీనేజ్ లో తన లవ్ ఫెయిల్ అయ్యిందని చెప్పింది. నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో ఈ ఘటన జరిగింది. నాతోపాటు చదువుకునే ఓ అబ్బాయి రోజు సాయంత్రం మా ఇంటికి ఫోన్ చేసేవాడు. నేను కూడా అతడితో మాట్లాడేదాన్ని. నన్ను ప్రేమిస్తున్నాడని అనుకున్నా. మా నాన్న ఇంట్లో ఉన్న సమయంలో ఫోన్ కట్ చేసేదాన్ని అని శిల్పా శెట్టి తెలిపింది. కలుసుకోవడానికి ఒకరోజు బస్ స్టాప్ కు రమ్మని పిలిచాడు. అతడి కోసం చాలా సమయం అక్కడే ఎదురుచూశా. అతడు మాత్రం రాలేదు. తాను మోసపోయాననే సంగతి మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందని శిల్పా శెట్టి తెలిపింది. ‘అసలు సంగతి, ఆ తర్వాత నాకు తెలిసింది. నా స్నేహితులతో అతను పందెం కట్టాడని, అందుకే, నాతో ప్రేమ నటించాడని తెలిసింది. ఇదంతా.. ఓ సినిమా కథలా అనిపించొచ్చు కానీ, ఇది నిజం. పందెంలో గెలవడం కోసమే అలా నటించిన అతను, నాతో బంధాన్ని తెంచుకున్నాడు. ఈ సంఘటన నన్ను ఆవేదనకు గురిచేయలేదని చెప్పను. చాలా రోజులు ఎంతో బాధపడ్డాను’ అని శిల్పాశెట్టి చెప్పింది.

English Title
Shilpa Shetty reveals her heartbreak story

MORE FROM AUTHOR

RELATED ARTICLES