అధ్యాత్మిక కేంద్రాలే లక్ష్యంగా వ్యభిచారం...యాదగిరిగుట్టకు, వారికి గల సంబంధం ఏంటి..?

అధ్యాత్మిక కేంద్రాలే లక్ష్యంగా వ్యభిచారం...యాదగిరిగుట్టకు, వారికి గల సంబంధం ఏంటి..?
x
Highlights

మరి ఇంతటి ఘోరమైన దారుణాలకు పాల్పడుతున్న వారి గురించి.. పోలీసులకు నిజంగా తెలియదా..? తీగ లాగితే డొంక కదిలినట్లు.. దశాబ్దాలుగా సాగుతున్న ఈ దుర్మార్గాన్ని...

మరి ఇంతటి ఘోరమైన దారుణాలకు పాల్పడుతున్న వారి గురించి.. పోలీసులకు నిజంగా తెలియదా..? తీగ లాగితే డొంక కదిలినట్లు.. దశాబ్దాలుగా సాగుతున్న ఈ దుర్మార్గాన్ని పూర్తిగా అరికట్టలేమా..? అసలీ ముఠాలు ఆధ్యాత్మిక కేంద్రాన్నే ఎందుకు ఎంచుకున్నాయి..? యాదగిరిగుట్టకు, వారికి గల సంబంధం ఏంటి..?

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సుమారు పదికి పైగా ప్రాంతాల్లో ఓ కులానికి చెందిన వారు వంశపారంపర్యంగా ఈ వ్యభిచారం వృత్తిని కొనసాగిస్తున్నారు. అయితే పూర్వకాలంలో ముఖ్యంగా గ్రామాల్లో కొన్ని వర్గాలకు చెందిన వారంతా ఈ వృత్తిని తమపరం చేసుకున్నారు. కానీ అప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఊళ్లల్లో ఉనికి కోల్పోవడంతో వారంతా ఆధ్యాత్మిక కేంద్రాలే లక్ష్యంగా చెల్లాచెదురయ్యారు.

తెలంగాణ విషయానికి వస్తే చాలా పుణ్యక్షేత్రాల దగ్గర ఇలాంటి వారు కనిపిస్తారు. యాదగిరిగుట్ట, వేములవాడ, ధర్మపురి వంటి క్షేత్రాల దగ్గర కొన్ని ముఠాలు ప్రత్యేకంగా వీధులను ఏర్పాటు చేసుకుని వృత్తిని కొనసాగిస్తున్నాయి. ఆయా క్షేత్రాలకు వచ్చే భక్తులు, పర్యాటకులే లక్ష్యంగా తమ వ్యాపారాలను నిర్వహిస్తుంటాయి. అమ్మాయిలను సప్లై చేసే ముఠాల నుంచి కొత్తవారిని తీసుకొచ్చి మరీ బిజినెస్‌ను పెంచుకుంటాయి.

ఆలయాల దగ్గర జరిగే ఎలాంటి కార్యకలాపాలపైనా నిఘా కొరవడుతుంది. అక్కడ కనిపించే వారంతా భక్తులనే నమ్మకం అందరిలో ఉంటుంది. ఇదే ఈ చీకటి వ్యాపారం చేసే వాళ్లకు అనువుగా మారింది. అంతకుమించి అది అత్యంత సురక్షితమైన ప్రదేశం కూడా. దీంతో ఈ ముఠాలు ఆలయ పరిసరాలే కేంద్రంగా చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నాయి. ఇక యాదగిరిగుట్ట విషయానికి వస్తే గుట్ట కింద ఇలాంటి కార్యకలాపాలు జరుగుతాయని చాలాకాలంగా వినిపిస్తున్న విషయమే. ముఖ్యంగా హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటం.. పుణ్యక్షేత్రం కావడంతో తరచూ వెళ్లేవారిని ఆకర్షించడం వంటి కారణాలతో గుట్ట దగ్గర ఈ చీకటి వ్యాపారం అభివృద్ధి చెందడానికి కారణాలుగా చెబుతున్నారు.

తరతరాలుగా ఈ దారుణమైన వృత్తిని కొనసాగిస్తున్న వారిలో యాదగిరిగుట్టలో మాయమైన కుటుంబాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఫ్యామిలీలు పరారై వారం దాటుతున్నా వారిని పట్టుకునే దిశగా దర్యాప్తు సాగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఆపరేషన్‌ ముస్కాన్‌ పై సుదీర్ఘమైన ఆచరణ ఉందని పోలీసులు చెబుతున్నారు. కనీసం మూడేళ్ల ప్రణాళికను వారు రచించుకున్నారు. మొదట ఇలాంటి వ్యాపారాలు జరుగుతున్న ప్రాంతాలపై దాడులు చేయడం తర్వాత ఇళ్లను సీజ్‌ చేయడం నిర్వాహకులపై పీడీ యాక్ట్‌ కింద కేసులు పెట్టడం వంటివి చేస్తున్నారు. సీజ్‌ చేసిన ఇళ్లను మూడేళ్ల వరకు తెరవకుండా కేసులు వేస్తున్నారు. ఇక పీడీ యాక్ట్‌ కింద ఆయా కుటుంబాలు యేడాది వరకు ఆయా ప్రదేశాలకు రాకుండా నిషేధం విధిస్తున్నారు. ఇలాంటి చర్యలతో రాష్ట్రంలో ముఠాలు, నిర్వాహకులకు చెక్ పెట్టాలనే యోచన చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories