నేడు పటేల్‌ విగ్రహావిష్కరణ

నేడు పటేల్‌ విగ్రహావిష్కరణ
x
Highlights

దేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి, సంస్ధానాల విలీనాధీశుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ సేవలను యావత్ జాతి మరోసారి స్మరించుకుంది. 143వ జయంతి సందర్భంగా వివిధ...

దేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి, సంస్ధానాల విలీనాధీశుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ సేవలను యావత్ జాతి మరోసారి స్మరించుకుంది. 143వ జయంతి సందర్భంగా వివిధ పార్టీల నేతలు, అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పటేల్ సొంత రాష్ట్రం గుజరాత్ లో నిర్మించిన ఐక్యతా విగ్రహం– స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ ని కాసేపట్లో ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.

ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ స్మారకార్థం గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున 182 అడుగుల పొడవైన ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా ఇది గుర్తింపు పొందింది. ఇందుకోసం దేశంలోని ప్రతి గ్రామం నుంచి ముడి ఇనుము సేకరించారు. రైతులు వినియోగించిన ఇనుము సేకరించి గుజరాత్‌కు తరలించారు. విగ్రహ ఏర్పాటులో 70 వేల టన్నుల సిమెంట్‌, 18 వేల ఐదు వందల ముడి ఇనుము, ఆరు వేల టన్నుల ఉక్కు, 17 వందల మెట్రిక్ టన్నుల కాంస్యం వినియోగించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు 2013 అక్టోబర్ 31న వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్ధాపన చేశారు. 2 వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ భారీ విగ్రహాన్ని నిర్మించారు. ఐదేళ్ల పాటు వందలాది మంది తీవ్రంగా శ్రమించి ఈ విగ్రహాన్ని నిర్మించారు. గిన్నిస్ రికార్డులకెక్కిన ప్రఖ్యాత ‘స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ’ కంటే ఇది రెట్టింపు పొడవు. వీక్షకుల కోసం విగ్రహం లోపల 132 మీటర్ల ఎత్తులో గ్యాలరీని ఏర్పాటుచేశారు. ఇక్కడ నుంచి సర్దార్‌ డ్యామ్‌ సహా పలు పర్వత ప్రాంతాలను సందర్శించే సౌకర్యం కల్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories