సాగరసంగమం అపూర్వ సినిమా సాగరం

Submitted by arun on Tue, 10/16/2018 - 15:25
sagara sangamam movie

సాగరసంగమం, సినిమా నచ్చని తెలుగు ప్రేక్షకులు చాల అరుదు. ఈ సినిమా జూన్ 3, 1983 లో విడుదలైన ఒక అందమైన తెలుగు చిత్రము. అంతకు ముందే విశ్వనాధ్ దర్శకత్వంలో విడుదలైన శంకరాభరణం చిత్రం విజయనంతమైన నేపథ్యంలో సంగీత, నృత్య కథాత్మక చిత్రాలకు ఆదరణ హెచ్చింది. ప్రతిభ ఉన్నా గాని గుర్తింపు పొందని, ఒక శాస్త్రీయ నర్తకునిగా కమల్ హాసన్ నటించాడు. కాశీనాధుని విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోకమల్ హాసన్ మరియు జయప్రద జంటగా నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో శరత్ బాబు మరియు ప్రముఖ గాయని శైలజ నటించారు. స్వరకల్పన ఇళయరాజా. ఇది తమిళంలో "సాలంగై ఓలి" అనే పేరుతో అనువదించబడి ఆ భాషలో కూడా విజయవంతంగా నడిచింది. ఈ సినిమా కోసం వేటూరి సుందర రామ్మూర్తి రాసిన గీతాలు ఎప్పటికీ నిలిచిపోయే ఆణిముత్యాలు. విశ్వనాధ్ మరియు కమల్ హాసన్‌ల నట జీవితంలో ఈ చిత్రానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. వీరి కలయికలో వచ్చిన మూడు చిత్రాలలో ఇది ఒకటి. స్వాతిముత్యం మరియు శుభ సంకల్పం తక్కిన రెండు చిత్రాలు. మీరు ఇప్పటి వరకు ఈ సినిమా చూడకుంటే మాత్రం .. తప్పక చుడండి. శ్రీ.కో.

English Title
sagara sangamam movie

MORE FROM AUTHOR

RELATED ARTICLES