నేను రెడీ... కేటీఆర్‌ సిద్ధమా?

నేను రెడీ... కేటీఆర్‌ సిద్ధమా?
x
Highlights

తెలంగాణ ఎన్నికల్లో ప్రజా కూటమి గెలుపును సోనియా గాంధీకి పుట్టినరోజు కానుకగా ఇస్తామని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నెల 11న ప్రజాకూటమి...

తెలంగాణ ఎన్నికల్లో ప్రజా కూటమి గెలుపును సోనియా గాంధీకి పుట్టినరోజు కానుకగా ఇస్తామని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నెల 11న ప్రజాకూటమి గెలవబోతోందని, గెలుపును ఆస్వాదించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు రాబోతోందని అన్నారు. తెలంగాణకు పట్టిన చీడ పీడలను వదిలించుకోవడానికి ప్రజలకు మంచి అవకాశం లభించిందని, విలక్షణమైన తీర్పు ఇవ్వనున్నారని, నాలుగు కోట్ల ప్రజలకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కొడంగల్ లో తాను ఓడిపోతున్నానని నిన్న కేటీఆర్ వ్యాఖ్యానించారని... అదే జరిగితే తాను రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతానని చెప్పారు. సవాల్ కు కట్టుబడి తాను గెలిస్తే... కేటీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని సవాల్ చేశారు. కేటీఆర్ ఆయన సవాల్ కు కట్టుబడి ఉండాలని... తాను గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకోవాలని అన్నారు. లేని పక్షంలో మీది కల్వకుంట్ల వంశమే కాదని భావించాల్సి ఉంటుందని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories