ఓడిపోతే నల్లమలకు పోతా... హరీష్ రావు శిక్షకు సిద్ధమా?

Submitted by arun on Sat, 08/04/2018 - 11:09

తెలంగాణలో కాంగ్రెస్, టిఆరెస్ మధ్య ప్రాజెక్టుల వార్ కొత్త టర్న్ తీసుకుంది. ప్రాజెక్టుల్లో అవినీతిని ఎత్తి చూపితే టీఆరెస్ ప్రభుత్వం ఎదురు దాడికి దిగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం ఆదానీ, అంబానీలతోపోటీ పడుతోందంటూ దుయ్యబట్టారు. రెండేళ్లలో ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరగడం చూస్తే అవినీతి ఏ రేంజ్ లో జరుగుతోందో తెలుస్తుందన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతిని  నిరూపించలేకపోతే ఏ శిక్షకైనా తాను సిద్ధమేనని రేవంత్ సవాల్ విసిరారు. 

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతిని  నిరూపించలేకపోతేఏ శిక్షకైనా తాను సిద్ధమేనని రేవంత్ సవాల్ విసిరారు. ప్రభుత్వం శీల పరీక్షకు సిద్ధపడాలని తాను ఓడిపోతే నల్లమల అడవులకు వెళ్లిపోతాననీ రేవంత్ సవాల్ విసిరారు. ప్రాజెక్టు నిర్మాణంలో లోటు పాట్లను చెబితే సరిదిద్దుకుంటారని ఆశించామని,కానీ ఎదురు దాడే లక్ష్యంగా కేసిఆర్ ప్రభుత్వం  పనిచేస్తోందనీ రేవంత్ విమర్శించారు. పది పైసలు లేని కేసిఆర్ కుటుంబం వేల కోట్లకు ఎలా పడగలెత్తిందో చెప్పాలన్నారు.
 

English Title
Revanth Reddy Challenge to TRS Leaders

MORE FROM AUTHOR

RELATED ARTICLES