రాజీవగాంధీ హత్య కేసు : తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం

Submitted by nanireddy on Sun, 09/09/2018 - 19:07
report-rajiv-gandhi-assassination-case-tamil-nadu-govt-cabinet-recommends-release-of-all-7-convicts (9283)

భారత మాజీ  ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితుల విషయంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిని విడుదల చేయాలంటూ క్యాబినెట్ సమావేశంలో తీర్మానించింది. ఈ  మేరకు కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపామని మంత్రి జయకుమార్ వెల్లడించారు. ఆర్టికల్ 161 ప్రకారం జ్యూడిషియల్ పవర్ గవర్నర్ చేతుల్లో ఉంటుంది కాబట్టి గవర్నర్ ఆమోదం కోసం పంపామని జయకుమార్ వెల్లడించారు. ఇక గవర్నర్ ఆమోదం పొందినట్లయితే 27 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న ఏడుగురు నిందితులకు విముక్తి లభించనుంది. కాగా 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూరులో  మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం కోసం అక్కడికి వెళ్ళారు. థాను అనే మహిళా ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకోవడంతో ఆయన మరణించారు. ఈ కేసులో  పెరారివలన్, వీ శ్రీహరన్ వురపు మురుగన్, టీ సుదేంద్ర రాజా, జయ కుమార్, రాబర్ట్ పయస్, పీ రవిచంద్రన్, నళిని ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 

English Title
report-rajiv-gandhi-assassination-case-tamil-nadu-govt-cabinet-recommends-release-of-all-7-convicts

MORE FROM AUTHOR

RELATED ARTICLES