దారుణం.. మహిళను పోలీస్‌ జీప్‌పై కట్టేసి..

దారుణం.. మహిళను పోలీస్‌ జీప్‌పై కట్టేసి..
x
Highlights

నిన్న మీరట్‌లో ముస్లిం యువకుడిని ప్రేమించిందన్న కారణంగా ఓ యువతిపై మహిళా పోలీసు దాడి చేస్తూ, దూషించిన ఘటన మరవక ముందే మరో అమానుష ఘటన వెలుగులోకి...

నిన్న మీరట్‌లో ముస్లిం యువకుడిని ప్రేమించిందన్న కారణంగా ఓ యువతిపై మహిళా పోలీసు దాడి చేస్తూ, దూషించిన ఘటన మరవక ముందే మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కనీసం మహిళ అని కూడా చూడకుండా ఖాకీలు కర్కసత్వం చూపారు. ఆమెను జీపు పైన కట్టేసి ఊరంతా తిప్పుతూ దారుణంగా ప్రవర్తించిన ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని చవిందా దేవి గ్రామంలో జరిగింది.

ఓ ఆస్తి వివాదంలో నిందితుడైన బాధితురాలి మావయ్యను అరెస్టు చేయడానికి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. ఆ సమయానికి నిందితుడు ఇంట్లో లేకపోవడంతో కుమారుడు, బాధితురాలి భర్తను తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో బాధితురాలు పోలీసులను అడ్డుకుంది. ఆగ్రహానికి గురైన పోలీసులు ఆమెను బలవంతంగా జీపు పైన కట్టేసి ఊరంతా తిప్పారు. ఆ వేగానికి ఆమె జీపు పైనుంచి కిండపడిపోయి తీవ్రంగా గాయపడింది.

ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. బాధితురాలి బంధువులు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి ఘటనపై విచారణకు ఆదేశించింది.
Related image

Show Full Article
Print Article
Next Story
More Stories