పౌరుషాల గడ్డ పులివెందుల.. స్పెషల్ స్టోరీ..!

పౌరుషాల గడ్డ పులివెందుల.. స్పెషల్ స్టోరీ..!
x
Highlights

రాష్ట్ర రాజకీయాల్లో పులివెందుల నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.. ఇక్కడి రాజకీయాలు తరచుగా అధిపత్యాలపై ఆధారపడి ఉంటాయి.. నమ్మిన నాయకుడుకుడిని...

రాష్ట్ర రాజకీయాల్లో పులివెందుల నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.. ఇక్కడి రాజకీయాలు తరచుగా అధిపత్యాలపై ఆధారపడి ఉంటాయి.. నమ్మిన నాయకుడుకుడిని భుజానెత్తుకుంటారు, అవసరమైతే ప్రాణమైనా ఇస్తారు .. ఆ నమ్మకమే నాలుగు దశాబ్దలుగా వైయస్ కుటుంబాన్ని రాజకీయ అందలమెక్కించింది.. ఇక్కడి ఎదురుపడి తలలు నరుక్కునే వర్గాలకి వైయస్ కుటుంబమంటే హడల్ అని చెప్తుంటారు.. కేవలం రాజకీయాలకే కాకా ఆర్ధిక , సామజిక , సినీ రంగాల్లో కూడా ఇక్కడి ప్రజలు తమదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు.. గతంలో సినీ ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉన్న చందమామ, విజయా కంబైన్స్ అధినేత నాగిరెడ్డి స్వస్థలం ఇక్కడే, అంతే కాదు ప్రఖ్యాత సాహితీవేత్త గజ్జెల మల్లారెడ్డి, సినీ నట దిగ్గజం పద్మనాభం వంటి వారెందరో పులివెందుల వారే కావడం విశేషం..

చరిత్ర..
పూర్వం ఇక్కడ పులులు మందలుగా తిరుగుతూ ఉండటం చేత ఈ ఊరుకు పులిమందల అన్న పేరు పడి, అది కాలక్రమేణా పులివెందులగా రూపాంతరం చెందిందని చెప్పుకుంటున్నారు. ఇక్కడ లయోలా కళాశాల ఉన్న కొండ పై ఒకప్పుడు కోట ఉండేది, కళాశాల భవనం కోసం తవ్వకాలు జరిపినప్పుడు రుద్రమదేవి విగ్రహం ఒకటి బయట పడింది. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు వేయించిన తొలి శాసనం (1509) పులివెందుల పట్టణానికి సమీపంలోని శ్రీరంగనాథస్వామి దేవస్థానంలో ఉందని చరిత్ర ఆధారంగా తెలుస్తుంది..

వ్యవసాయం..
పులివెందులలో ముఖ్యంగా ప్రొద్దుతిరుగుడు, బత్తాయి, అరటి, వేరు శెనగ సాగు చేస్తారు. చిత్రావతి నది పై పార్నపల్లె వద్ద గల ఆనకట్ట ద్వారా తాగు నీరు ఇంకా సాగు నీరు అందుతున్నాయి.

విద్య..
ఇక్కడి చుట్టు పక్కల గ్రామాలకు, జిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఇది ఒక విద్యా కేంద్రంగా వ్యవహరిస్తుంది. ప్రఖ్యాత జవాహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల 2006 లో ఇక్కడ స్థాపించబడింది. అంతేకాదు పులివెందులకు అతి సమీపంలోని ఇడుపులపాయ వద్ద ట్రిపుల్ ఐటీని కూడా స్థాపించబడింది..

పులివెందుల రాజకీయా ప్రస్థానం..
1955 లో పులివెందుల నియోజకవర్గంగా ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగాయి.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పెంచికల బసిరెడ్డి, కమ్యూనిస్ట్ అభ్యర్థి జి. మల్లారెడ్డిపై గెలుపొందారు.. 1962 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి బాలిరెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి పెంచికల బసిరెడ్డిపై గెలుపొందారు.. ఆ తరువాత గత ఎన్నికల్లో ఓటమి చెందిన పెంచికల బసిరెడ్డి 1967 ఎన్నికల్లో కమ్యూనిస్ట్ అబ్యర్ధి వెంకట రెడ్డిపై గెలుపొందారు.. అంతేకాదు 1972 ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్ అబ్యర్ది దేవిరెడ్డిపై విజయం సాధించారు.. ఇక 1978 లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ తరుపున పోటీచేసి ఎమ్మెల్యే గా గెలుపొందారు.. ఆ తరువాత 1983 ఎన్నికల్లో వైయస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీచేసి సమీప టీడీపీ అబ్యర్ధి వైవీ రెడ్డిపై గెలుపొందారు..

అంతేకాదు మధ్యలో పులివెందులకు ఉపఎన్నిక రాగా ఆ ఎన్నికల్లో కూడా విజయం వైయస్ ను వరించింది.. ఆ తరువాత జరిగిన రాజకీయ మార్పు వలన వైయస్ పార్లమెంటుకు పోటీచేసి గెలుపొందారు.. ఈ నేపధ్యలో పులివెందులకు వైయస్ తమ్మడు వివేకానందరెడ్డి ప్రాతినిధ్యం వహించారు.. ఇక అప్పటినుంచి వైయస్ కుటుంభం పులివెందులలో ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉంది.. అయితే ఇక్కడ టీడీపీ కూడా అలుపెరగని పోరాటం చేస్తూ ఉంది.. పదవిలో ఉండగా వైయస్ అకాల మరణం చెందడంతో ఒకే ఒక్కసారి పులివెందులకు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది అప్పుడు రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ గెలుపొందగా.. కొన్ని రోజులకే కాంగ్రెస్ తో విభేదించి సొంతపార్టీ స్థాపించిన వైయస్ కుమారుడు జగన్, సంచలనాత్మక రాజకీయనేతగా ఎదిగారు.. మూడుసార్లు వైయస్ కుటుంబంతో తలపడి పట్టు వదలని విక్రమార్కుడిలా వ్యవహరిస్తున్న డిఎస్ రెడ్డి బంధువు సతీష్ కుమార్ రెడ్డి కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.. ఇక తరువాతి రాజకీయ పరిస్థితులు అందరికి తెలిసినవే..

Show Full Article
Print Article
Next Story
More Stories