ఉద్యోగులకు శుభవార్త... ఆగస్టు 15 నుంచి పీఆర్‌సీ- కేసీఆర్‌

Submitted by santosh on Thu, 05/17/2018 - 11:10
prc from august 15th

రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. రెండు మూడు రోజుల్లో పీఆర్‌సీ కోసం త్రిసభ్య కమిటీ వేస్తామని ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై మంత్రి వర్గ ఉపసంఘం, ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ చర్చించారు. ఉద్యోగుల బదిలీల విధివిధానాలపై స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ మిశ్రా ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని చెప్పారు. 

రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్లటంలో ఉద్యోగులదే కీలక పాత్ర అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల‌ సమస్యలపై సీఎం కేసీఆర్ మంత్రి వర్గ ఉపసంఘంతో చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగులది కీలకపాత్రని.. తెలంగాణ ఉద్యోగులు కమిట్‌మెంట్‌తో పని చేస్తున్నారన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ నైతిక బాధ్యతని సీఎం అన్నారు. రెండు, మూడు రోజుల్లో పీఆర్సీ కోసం త్రిసభ్య కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. జూన్ 2న మధ్యంతర భృతి ఇస్తామని చెప్పారు. ఆగస్టు 15లోపు కమిటీ నివేదిక ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసుల సమస్యలను కూడా సబ్‌ కమిటీ చర్చిస్తుందన్నారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంతో కష్టపడుతున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. బదిలీల విధివిధానాలపై స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ మిశ్రా ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని చెప్పారు. దంపతులు ఒకేచోట పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.  అవినీతి, అక్రమాలకు తావులేకుండా ఉద్యోగుల బదిలీలు చేస్తామని.. అవినీతికి పాల్పడివారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్‌ల అంశంపై ప్రభుత్వమే న్యాయపోరాటం చేస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు, టీచర్లకు ప్రత్యేక ఎలవెన్స్‌ ఉంటాయన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానంపై ఉద్యోగులకు అనుమానాలున్నాయని చెప్పారు. పదోన్నతుల కోసం రెండేళ్ల సర్వీసు ఉంటే చాలని సీఎం కేసీఆర్‌ అన్నారు.

English Title
prc from august 15th

MORE FROM AUTHOR

RELATED ARTICLES