త్వరలో రాజకీయాల్లోకి వస్తాం: ప్రబోధనాంద స్వామి

Submitted by arun on Sat, 09/22/2018 - 13:38

కుట్రతోనే తమ ఆశ్రమంపై దాడి జరిగిందన్నారు ప్రబోధానంధ స్వామి. రాజకీయ కుట్రలో భాగంగానే దాడులు చేశారని ఆరోపించారు. స్థానిక ప్రజలను జేసీ సోదరులు రెచ్చగొట్టే తమ ఆశ్రమంపై దాడులు చేయించారని ప్రబోధనాంధ స్వామి తెలిపారు. త్వరలో తాను కూడా రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు ప్రబోధానంధ స్వామి. రాజకీయాల ద్వారా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అనిపిస్తే తాము కూడా త్వరలోనే రాజీయాల్లోకి వస్తామని చెప్పారు. తాను ఎవరికి బెదిరేది లేదని ప్రబోధానంధ స్పష్టం చేశారు. తమ ఆశ్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడంలేదని ...ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఏ దేవున్ని కించపరచలేదన్నారు. తన ప్రసంగాలను కట్‌చేసి విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

English Title
prabhodhanandha swamy comments jc brothers

MORE FROM AUTHOR

RELATED ARTICLES