ఇరుక్కు పోయారు...లైంగిక ఆరోపణల్లో రాజకీయ నేతలు

Submitted by arun on Tue, 08/07/2018 - 16:52
gd

తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు ప్రముఖ నేతలు వివాదంలో చిక్కుకోవడం పెను దుమారం రేపుతోంది. కాంగ్రెస్ నేత, మాజీ చీఫ్ విప్ గండ్రపైనా, నిజామాబాద్ జిల్లా మాజీ కాంగ్రెస్ నేత డీఎస్ తనయుడు సంజయ్ పైనా లైంగిక దోపిడీ ఆరోపణలు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. తమపై ఆరోపణలు  రాజకీయకక్షతో కూడుకున్నవనీ ఇద్దరు నేతలు చెబుతున్నా ఎన్నికలు దగ్గర పడుతున్న టైమ్ లో ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారుతోంది.

 ఎన్నికల వేళ రాజకీయ నాయకులపై లైంగిక ఆరోపణల వేధింపులు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో  కీలక నేత మాజీ పిసిసి అధ్యక్షుడు డిఎస్  పెద్ద కుమారుడిపై వచ్చిన ఆరోపణలు డీఎస్ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసేలా ‎ఉన్నాయి. డీఎస్ తనయుడు సంజయ్  బీఎస్సీ నర్సింగ్ విద్యార్ధులను లైంగికంగా వేధిస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు డీఎస్ రాజకీయ జీవితాన్ని మసక బార్చేలా మారాయి. శాంకరీ నర్సింగ్ కాలేజీలో విద్యార్ధులపై సంజయ్ లైంగిక దాడులకు పాల్పడ్డాడన్న ఆరోపణలను విచారించిన పోలీసులు ఆయనపై నిర్భయ కేసు పెట్టారు మొదట్లో తనపై రాజకీయ కక్షతో ఈ ఆరోపణలు చేస్తున్నారంటూ ఆరోపించిన సంజయ్ పోలీసులు రంగంలోకి దిగే సరికి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సంజయ్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సంజయ్ వ్యవహారం అటు డిఎస్ కు, మరో తనయుడు అరవింద్ కు తలనొప్పులు తెస్తోంది. టిఆరెస్ లో ఇమడ లేక కాంగ్రెస్ వైపు అడుగేయాలని డిఎస్ చేసిన ప్రయత్నంపై ఆగ్రహించిన టిఆరెస్ అధిష్టానం ఆయనకు పొమ్మనలేక పొగపెట్టింది. దీంతో ఆయన పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా మారింది. మరోవైపు డిఎస్ బిజెపిలో చేరతారన్న ఊహాగానాలు మొదలైన టైమ్ లోనే పెద్ద కొడుకు సంజయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు డీ ఎస్ కుటుంబ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీశాయి.

ఇక కాంగ్రెస్ నేత, మాజీ విప్ గండ్ర వెంకట  రమణారెడ్డి పైనా ఇలాంటి ఆరోపణలే వెలుగు చూశాయి తనను నాలుగేళ్లుగా వంచించి వాంఛలు తీర్చుకున్నాడని, ఇప్పుడు మోసగించి పోలీసులతో అరెస్టు చేయించారంటూ విజయలక్ష్మి అనే మహిళ గండ్రపై కంప్లయింట్ ఇచ్చింది. ఈ ఆరోపణలపై గండ్ర కుటుంబం, బంధువర్గం ఖంగు తింది. అయితే తన భర్త అమాయకుడని ఇదంతా  రాజకీయ కుట్రేనని గండ్ర భార్య జ్యోతి అంటున్నారు.

అయితే తన మొబైల్ డాటా  తీస్తే గండ్ర నైజం బయటపడుతుందని కాల్ డాటాను బయటపెట్టాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. కానీ ఆమె అనేక మందిని ఇలాగే వంచించిందన్నది మరికొందరి ఆరోపణ. గండ్రపై వచ్చిన ఆరోపణలను ఖండించారు మరో కాంగ్రెస్ నేత సీతక్క. మొత్తం మీద ముందస్తు ఎన్నికల నేపధ్యంలో ఈ ఇద్దరి నేతలపైనా వచ్చిన ఆరోపణలు వారి రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది కరంగా మారుతున్నాయి.

English Title
political leaders sex allegations

MORE FROM AUTHOR

RELATED ARTICLES