తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది.

తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది.
x
Highlights

తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది.....

తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది.. సమస్యాత్మకమైన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంDR. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు... పోలింగ్ బూత్ లకు చేరుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్దఎత్తున బలగాలను మోహరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 32,815 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 3873, వనపర్తిలో 280 కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల విధుల కోసం 1,60,509 మంది సిబ్బందిని కేటాయించారు. ఎన్నికల కోసం 55,329 బ్యాలెట్‌ యూనిట్లు, 42,751 వీవీప్యాట్‌ యంత్రాలు, 39,763 కంట్రోల్‌ యూనిట్లను వినియోగిస్తున్నారు.

రాష్టంలో 2కోట్ల 80లక్షల 64వేల 684మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,41,56,182 కాగా స్త్రీలు 1,39,05,811. 119 నియోజకవర్గాల్లో మొత్తం 1821మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మల్కాజ్‌గిరిలో అత్యధికంగా 42మంది పోటీలో ఉండగా, బాన్సువాడలో అత్యల్పంగా కేవలం ఆరుగురే బరిలో ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ సచివాలయంలో ఏర్పాటు చేసిన మానిటరింగ్ సెల్ ద్వారా ....వెబ్ కాస్టింగ్, సిసి కెమెరాల ద్వారా పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు. ఈ మానిటరింగ్ సెల్ ద్వారా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల నుంచి సమాచారాన్ని గంట గంటకు తెప్పించుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories