అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న పార్సిల్ బాంబులు

x
Highlights

అగ్ర రాజ్యం అమెరికాను పార్సిల్ బాంబుల భయం వీడటం లేదు. ప్రముఖులే లక్ష్యంగా ఆగంతకులు పార్సిల్ బాంబులను పంపుతున్నారు. తాజాగా మరో రెండు పార్సిల్...

అగ్ర రాజ్యం అమెరికాను పార్సిల్ బాంబుల భయం వీడటం లేదు. ప్రముఖులే లక్ష్యంగా ఆగంతకులు పార్సిల్ బాంబులను పంపుతున్నారు. తాజాగా మరో రెండు పార్సిల్ బాంబులను సీక్రెట్ సర్వీస్‌ గుర్తించింది. యూఎస్ ప్రతినిధితో పాటు మరో ఐదుగురికి పంపిన పార్సిల్ బాంబులను గుర్తించింది. తాజా పరిణామాల నేపధ్యంలో ఎఫ్‌బీఐ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి స్ధాయి తనిఖీల తరువాతే ప్రముఖుల నివాసాల్లోకి వాహనాలు, ఇతర వస్తువులను అనుమతించాలని ఆదేశించింది.

మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, 2016 ఎన్నికల్లో ట్రంప్‌ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌ నివాసాలకు పంపిన పేలుడు పదార్థాలను నిన్న సాయంత్రం ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించారు. ఒబామా పేరిట వచ్చిన పార్సిల్‌ను వాషింగ్టన్‌లో, హిల్లరీ చిరునామాతో వచ్చిన ప్యాకేజీని న్యూయార్క్‌లో దర్యాప్తు సంస్ధల అధికారులు గుర్తించారు. పార్సిల్ బాంబులు పంపుతున్న ఆగంతకుల ఆచూకి తెలుసుకునేందుకు ఎఫ్‌బీఐతో పాటు వివిధ దర్యాప్తు సంస్ధలు రంగంలోకి దిగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories