తెలంగాణలో ఎవరికి ఓటెయ్యాలో చెప్పిన పవన్

తెలంగాణలో ఎవరికి ఓటెయ్యాలో చెప్పిన పవన్
x
Highlights

తెలంగాణ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలకు తన సందేశాన్ని అందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం..తక్కువ సమయం ఉండటం వల్లే...

తెలంగాణ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలకు తన సందేశాన్ని అందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం..తక్కువ సమయం ఉండటం వల్లే జనసేన పార్టీ పోటీకి దూరంగా ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. ఇక్కడి పోరాట స్ఫూర్తిని, త్యాగాలను సంపూర్ణంగా అర్ధం చేసుకున్నాను కాబట్టే తెలంగాణ అంటే నాకు అంత గౌరవమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ ద్వారా తెలియచేశారు. ముందస్తు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో తక్కువ సమయాభావం, ఎక్కువ సమయాన్ని నేను కేటాయించలేకపోవడం వల్ల జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేయలేకపోతుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికలలో పారదర్శకత వున్న వారికి ఓటేయాలంటూ పిలుపు నిచ్చారు. ఎవరైతే నిజాయితీగా ఉంటూ పాలన అందిస్తారో వారికే ఓటేయాలని తెలిపారు. తక్కువ అవినీతి - ఎక్కువ పారదర్శకత ఉన్నవాళ్లకే ఓటేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. కాగా.. తెలంగాణలో ఇటు కూటమి, అటు టీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల విషయంలో పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లయింది. ఏ ఒక్క పార్టీకి పవన్ స్పష్టమైన మద్దతు ప్రకటించలేదు. అభ్యర్థులను చూసి ఓటేయాలంటూ కార్యకర్తలకు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories