ప‌వ‌న్ ట్వీట్‌కు క‌త్తి ఘాటు రిప్లై!

Submitted by arun on Sat, 01/06/2018 - 11:20
pk

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు, సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్‌కు మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అభిమానుల‌పై కోపంతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై వ్య‌క్తిగ‌త స్థాయిలో కూడా మ‌హేష్ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో తాజాగా ప‌వ‌న్ ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశాడు.

`వ్య‌క్తిత్వంలో నిన్ను ఓడించ‌డం చేత‌కాని వాళ్లు.. నీ కులం, ధ‌నం, వ‌ర్ణం గురించి మాట్లాడ‌తారు` అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు వెంట‌నే మ‌హేష్ క‌త్తి ఘాటుగా స్పందించాడు.‘ధనం, వర్ణం, కులం గురించి మాట్లాడుతున్నది నీ ఫ్యాన్స్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్. నేను కాదు. కాబట్టి పెట్టె గడ్డేదో వాళ్ళకి పెట్టు. ఇక వ్యక్తిత్వం గురించి అంటావా...అది నువ్వు మాట్లాడకపోతేనే బెటర్! అనవసరంగా కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది. జాగ్రత్త!’ అంటూ ఘాటుగా బదులిచ్చారు.

పవన్‌ రాజకీయ విధానాలను కత్తి మహేశ్‌ ఘాటుగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో పవన్‌ అభిమానులను ఆగడాలను సైతం ఆయన ఫేస్‌బుక్‌లో ఎండగడుతున్నారు. పవన్‌ ఫ్యాన్స్‌ పేరిట కొందరు చేస్తున్న దుర్భాషలను ఫేస్‌బుక్‌ వేదికపై బహిర్గతం చేస్తున్నారు. ఈ వివాదం ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది.
 

English Title
pawan kalyan tweet kathi mahesh counter

MORE FROM AUTHOR

RELATED ARTICLES