జనసేనకు పవన్‌ మాతృమూర్తి విరాళం

Submitted by arun on Wed, 10/31/2018 - 11:27
pk

 జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌  తల్లి అంజనా దేవి ఆ పార్టీకి విరాళం ఇచ్చారు.  జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆమె 4లక్షల రూపాయల చెక్కును అందించారు.  పవన్‌ కల్యాణ్ ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్‌ రద్దు కోసం చేస్తున్న పోరాటానికి జనసేన మద్దతు ఉంటుందని పవన్ కల్యాణ్‌ చెప్పారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా పెన్షన్ విలువేంటో తనకు తెలుసునని, అందుకే పెన్షన్ కోసం ఉద్యమిస్తున్న వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలుస్తానన్నారు. 

English Title
Pawan Kalyan receives an amount of Rs 4 lakh from his mother

MORE FROM AUTHOR

RELATED ARTICLES