ఇరాన్‌లో ఘోర ప్రమాదం..విమానం కుప్పకూలి 66 మంది మృతి

ఇరాన్‌లో ఘోర ప్రమాదం..విమానం కుప్పకూలి 66 మంది మృతి
x
Highlights

ఇరాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. టెహరాన్ నుంచి యాసుజ్ వెళ్తున్న విమానం మధ్య ఇరాన్‌లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 66 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో 60...

ఇరాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. టెహరాన్ నుంచి యాసుజ్ వెళ్తున్న విమానం మధ్య ఇరాన్‌లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 66 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో 60 మంది ప్రయాణికులు..ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నట్లు సమాచారం. టెహరాన్‌లో టేకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత ఆ విమానం రాడార్ లో కనిపించకుండా పోయింది. తర్వాత కొద్ది సేపటికి సెమిరామ్ టౌన్ దగ్గర్లోని కొండ ప్రాంతంలో విమానం కూలింది. ఎమ‌ర్జెన్సీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం జ‌రిగిన స్థ‌లానికి వెళ్లేందుకు ప్ర‌యత్నిస్తున్నా.. వాతావ‌ర‌ణం స‌రిగా లేక‌పోవ‌డంతో వెళ్లలేక‌పోయింది. దీంతో సహాయక చర్యలు ఆలస్యమౌతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories