ఆరని పద్మావత్ మంటలు

ఆరని పద్మావత్ మంటలు
x
Highlights

పద్మావత్ సినిమా వివాదం మరింత రాజుకుంది. సినిమా విడుదలకు ఒక రోజు ముందు కర్ణిసేన హింసాత్మక ఘటనకు పాల్పడింది. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ , హర్యానా,...

పద్మావత్ సినిమా వివాదం మరింత రాజుకుంది. సినిమా విడుదలకు ఒక రోజు ముందు కర్ణిసేన హింసాత్మక ఘటనకు పాల్పడింది. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ , హర్యానా, ఢిల్లీలో దాడులకు దిగింది. అహ్మదాబాద్ లో ధియేటర్ల దగ్గర బీభత్సం సృష్టించింది. ధియేటర్లపై దాడులు చేసిన కర్ణిసేన..వందకు పైగా వాహనాలను తగులబెట్టింది.

అహ్మదాబాద్‌లోని మూడు షాపింగ్ మాల్స్ దగ్గర భారీ ఎత్తున హింసకు దిగింది. హిమాలయ ధియేటర్, పీవీఆర్ మల్టిప్లెక్స్ , కార్నివాల్ ధియేటర్ల దగ్గర కర్ణిసేన బీభత్సం సృష్టించింది. ధియేటర్ల అద్దాలను ధ్వంసం చేసి అక్కడ పార్క్ చేసిన కార్లు, బైకులకు నిప్పంటించింది. కర్ణిసేన దాడిలో పలు వాహనాలు పూర్తిగా తగులబడ్డాయి. గత రాత్రి నుంచి అహ్మదాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలాగే సూరత్ లోనూ హింసాత్మక ఘటనలు జరిగాయి. రేపు పద్మావత్ సినిమా విడుదల కాబోయే ధియేటర్ల దగ్గర, అలాగే కీలక ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు సంయమనంపాటించాలని గుజరాత్ సిఎం విజయ్ రూపాని విజ్ఞప్తి చేశారు. అహ్మదాబాద్, సూరత్ లో పలువురు అనుమానితుల్ని అరెస్ట్ చేశారు.

ఇక హర్యానాలోని గురుగ్రామ్‌లో పద్మావత్ సినిమా ప్రివ్యూ షో ప్రదర్శిస్తున్న ధియేటర్లను కర్ణిసేన టార్గెట్ చేసింది, గురుగ్రామ్‌లో షాపింగ్‌ మాల్స్‌‌‌పై దాడి చేసింది. దీంతో గురుగ్రామ్ నగరంలో 144సెక్షన్‌ విధించారు. ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన పద్మావత్ సినిమా రేపు దేశవ్యాప్తంగా విడుదల కాబోతోంది. పద్మావత్‌ను కొన్ని రాష్ట్రాలు ఆ నిషేధించగా ఈ నెల 18న సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టివేసింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై పునరాలోచన చేయాలంటూ మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా నిన్న న్యాయస్థానం తిరస్కరించింది. పద్మావత్‌ సినిమా విడుదలపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎట్టి పరిస్థితుల్లో మార్చబోమని స్పష్టం చేసింది. అలాగే సినిమాను నిలిపేయాలని రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణి సేన, అఖిల భారతీయ క్షత్రియ మహాసభ దాఖలు చేసిన పిటిషన్‌లను కూడా ధర్మాసనం కొట్టేసింది. దీంతో పద్మావత్ విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories