నా 27 సినిమాల్లో ఎన్నడూ తండ్రి చితికి నిప్పు పెట్టలేదు: కన్నీటితో ఎన్టీఆర్

Submitted by arun on Wed, 10/03/2018 - 11:44
ntr

‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి నటీనటులతోపాటు టాలీవుడ్‌కి చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు . త్రివిక్రమ్‌తో ఫిల్మ్ చేయాలన్నది 12 ఏళ్ల తన కల అని చెప్పుకొచ్చాడు."ఇది నా 28వ చిత్రం. గత 27 చిత్రాల్లో ఎప్పుడూ తండ్రి చితికి నిప్పంటించే పాత్రలను ఏ దర్శకుడూ నాకు ఇవ్వలేదు. కానీ, ఈ సినిమాలో యాధృచ్చికమో ఏమో... మనం అనుకునేది ఒకటైతే, పైవాడు రాసేది మరొకటి" అని ఎన్టీఆర్ భావోద్వేగంతో మాట్లాడాడు. నెల కిందట తన జీవితంలో జరిగిన సంఘటన ఈ చిత్రానికి ముడిపడిందేమోనని అన్నాడు. మనిషిగా పుట్టినందుకు ఎలా బతకాలో చెప్పేదే ఈ చిత్రమని తెలియజేశాడు.
 

English Title
ntr emotional speech at Aravinda Sametha Veera Raghava pre release event

MORE FROM AUTHOR

RELATED ARTICLES