ఎన్టీఆర్ బయోపిక్ కు రెండు టైటిల్స్.. అవి..

Submitted by nanireddy on Thu, 10/04/2018 - 15:52
ntr biopic updates

దివంగత నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని స్వయంగా అయన తనయుడు బాలకృష్ణ నిర్మిస్తున్నారు.  జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇది జీవిత చరిత్ర కాబట్టి దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించాలని బాలకృష్ణ, క్రిష్ నిర్ణయించారు. అందులో భాగంగా మొదటి పార్టును జనవరి 9 వ తేదీ సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యాలని భావిస్తుండగా. రెండో పార్టును ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయాలనీ నిర్ణయించారు. ఈ రెండు భాగాలకు రెండు విధాలా టైటిల్ పెట్టారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ అనేది మొదటి పార్టు టైటిల్ కాగా రెండో పార్టుకు ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ అనేది రెండో టైటిల్. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటిస్తుండగా, అక్కినేనిగా సుమంత్, చంద్రబాబుగా రానా నటిస్తున్నారు. బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటిస్తోంది. 

English Title
ntr biopic updates

MORE FROM AUTHOR

RELATED ARTICLES