రాష్‌ డ్రైవింగ్‌ చేస్తే ఇక అంతే సంగతులు

రాష్‌ డ్రైవింగ్‌ చేస్తే ఇక అంతే సంగతులు
x
Highlights

రాష్‌ డ్రైవింగ్‌ చేసే వారి విషయంలో సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయాన్ని వెలువరించింది.ఇప్పటి వరకు ఎలాంటి తప్పిదం జరిగినా వాహానాలకు ఇన్సురెన్సును...

రాష్‌ డ్రైవింగ్‌ చేసే వారి విషయంలో సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయాన్ని వెలువరించింది.ఇప్పటి వరకు ఎలాంటి తప్పిదం జరిగినా వాహానాలకు ఇన్సురెన్సును క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఉంది.కాని ఇకనుంచి మాత్రం రాష్‌ డ్రైవింగ్ కారణంగా ఏదైనా ప్రమాదం జరిగి,నష్టం సంభవిస్తే దానికి భీమా వర్తించదు అని కోర్టు తీర్పు చెప్పింది.

2012 లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదానికి చెందిన కేసు విషయంలో తీర్పు వెలువరిస్తూ సుప్రీం తన నిర్ణయాన్ని వెలిబుచ్చింది.2012, మే 20న జరిగిన కారు ప్రమాదంలో దిలీప్‌ భౌమిక్‌ అనే వ్యక్తి మరణించాడు.ఆయన కుటుంబ సభ్యులు 10.57 లక్షల రూపాయలు చెల్లించాలని బీమా కంపెనీని కోరాగా వారు రాష్ డ్రైవింగ్ ను కారణంగా చూపూతూ క్లెయిమ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు.ఈ విషయంలో కుటుంబం సభ్యులు కోర్టును ఆశ్రయించడంతో, కంపెనీ వాదనలు కూడా విన్న న్యాయస్థానం సొంత తప్పిదం వల్ల జరిగిన ప్రమాదానికి భీమా వర్తించదు అంటూ తీర్పుని ఇచ్చింది.కాబట్టి ఇక నుండి వాహానదారులు రాష్ డ్రైవింగ్ మానుకోవాల్సిందే.అయితే కొంత మంది మాత్రం ఇక నుంచి పలు భీమా కంపేనీలు ఏ ప్రమాదం జరిగినా రాష్ డ్రైవింగ్ ను సాకుగా చూపించి నష్టపరిహారాన్ని ఇవ్వకుండా ఉండే అవకాశం ఉందని వాదిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories