ఎన్టీఆర్ బయోపిక్ పై కీలక నిర్ణయం

Highlights

'ఎన్టీఆర్‌' అంటే తెలుగుప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకం.. ఈ పేరు చెవినపడితే చాలు రోమాలు నిక్కబొడిచేంత పవరుంది. అలాంటి గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా...

'ఎన్టీఆర్‌' అంటే తెలుగుప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకం.. ఈ పేరు చెవినపడితే చాలు రోమాలు నిక్కబొడిచేంత పవరుంది. అలాంటి గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. అందులో అయన తనయుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్నారు. బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. మొదటి పార్ట్ ను జనవరి 10న విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే రెండో పార్టును నెలరోజుల వ్యవధిలో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట. కాగా ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో రానా, శ్రీదేవిగా రకుల్, జయప్రదగా రాశీఖన్న , సావిత్రిగా నిత్యామీనన్, అక్కినేని కేరెక్టర్‌లో సుమంత్ కన్పించనుండగా… హరికృష్ణ పాత్రను కళ్యాణ్ రామ్ పోషిస్తున్నారు. ఇదిలావుంటే ఈ సినిమాలో బాలకృష్ణ మొత్తం 60 గెటప్‌లలో కనిపించనున్నారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్స్ ఎన్టీఆర్ బయోపిక్ లో కీ రోల్స్ పోషిస్తున్నారు. ం

Show Full Article
Print Article
Next Story
More Stories