అక్టోబర్ 23న హీరో ప్రభాస్ కీలక ప్రకటన..!

Submitted by nanireddy on Thu, 09/27/2018 - 10:04
new-gossip-on-prabhas-marriage

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ఎవరంటే టక్కున గుర్తుకువచ్చే పేరు.. యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ అనే.. బాహుబలి తరువాత పెళ్లి చేసుకుంటానని అప్పట్లో చెప్పాడు.కానీ సినిమా రిలీజ్ అయి ప్రపంచ రికార్డు నమోదు చేసినా ఆయన పెళ్లి ప్రకటన రాలేదు. ప్రభాస్ నుంచి పెళ్లి ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందా అని ఆయ‌న ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆ మ‌ధ్య ప్ర‌భాస్‌కి పెళ్లి ఫిక్సైంద‌ని, విజ‌య‌వాడ అమ్మాయిని చేసుకోబోతున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం చేశారు. కాని అదంతా ప్రచారంగానే తేలిపోయింది. అయితే తాజాగా ప్ర‌భాస్ పెళ్ళి ప్ర‌క‌ట‌న‌కి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్టోబర్ 23న ఆయన 39వ పుట్టిన రోజు కావ‌డంతో ఆ రోజు ప్రభాస్ తన పెళ్లిపై కీలక ప్రకటన చేసే అవకాశముందని ఆ వార్త సారాంశం.. మ‌రి ఇందులో నిజమెంతో తెలియాలంటే అక్టోబ‌ర్ 23 వరకు ఆగాల్సిందే..  ఆరోజు కోసం ప్ర‌భాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం అయన సాహో చిత్రంతో బిజీగా ఉన్నారు.

English Title
new-gossip-on-prabhas-marriage

MORE FROM AUTHOR

RELATED ARTICLES