అమ్మ గడుగ్గాయి : రెండున్నర ఏళ్ళకే తాతను మించిన మనవడు

Highlights

నారా వారి వారసుడు రెండున్నర ఏళ్ళకే తాతను మించిపోయాడు. సీఎం తాత కంటే ఎక్కువ ఆస్తులు సంపాదించేశాడు. ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి కంటే ఆయన మనవడే ...

నారా వారి వారసుడు రెండున్నర ఏళ్ళకే తాతను మించిపోయాడు. సీఎం తాత కంటే ఎక్కువ ఆస్తులు సంపాదించేశాడు. ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి కంటే ఆయన మనవడే సంపన్నుడుగా మారాడు. సంపదలో మనవడు దేవాన్ష్ దరిదాపుల్లో కూడా తాత చంద్రబాబు లేకపోవడం విశేషం.

చంద్రబాబు వృత్తి : రాజకీయాలు ( ప్రస్తుతం సీఎం )
దేవాన్ష్ వృత్తి : ఇంకా ఏమీ లేదు

చంద్రబాబు వయసు : 67 ఏళ్ళు

దేవాన్ష్ వయసు : రెండున్నర ఏళ్ళు

చంద్రబాబు ఆస్తి : 2కోట్ల 53లక్షలు ( అప్పులు 3.58 కోట్లు)

దేవాన్ష్ ఆస్తి : 11కోట్ల 54లక్షలు

ఇది తాతామనవళ్ళ ఆస్తుల లెక్క. ఓ రాష్ట్రానికి సీఎం అంటే ఆయన దగ్గర బోల్డంత సంపద ఉందనుకుంటారు. లెక్కలేనని ఆస్తులు ఉండొచ్చని భావిస్తారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో మాత్రం సీన్ రివర్స్‌గా కనిపిస్తోంది. సీఎం గారి ఆస్తి ఆయన కుటుంబ సభ్యులకంటే చాలా తక్కువ. అంతెందుకు రెండున్నర ఏళ్ళ మనవడు దేవాన్ష్..ఆస్తి.... తాతయ్య కంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ. అసలు చంద్రబాబు ఆస్తుల విలువలో పోలిస్తే...ఆయనకున్న అప్పులే ఎక్కువ. రెండున్నర ఏళ్ళ బుడ్డోడికి అంత ఆస్తి అక్కడిదనే కదా డౌట్.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ “ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్తులు రెండు కోట్ల ముప్పై మూడు లక్షలుగా తెలిపారు .అంతే కాకుండా తన తల్లి భువనేశ్వరి నికర ఆస్తులు ఇరవై ఐదు కోట్ల రూపాయల నలబై ఒక్క లక్షలు ,తన సతీమణి బ్రాహ్మణి నికర ఆస్తులు కేవలం 15 కోట్ల ఒక లక్ష రూపాయలు ,తన తనయుడు దేవాన్స్ ఆస్తులు పదకొండు కోట్ల యాబై నాలుగు లక్షల రూపాయలుగా ఆయన తెలిపారు ..
నాయనమ్మ భువనేశ్వరి రూ.9.17 కోట్ల విలువైన ఆస్తులను దేవాన్ష్ పేరిట ట్రాన్సుఫర్ చేశారు. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు, తల్లి తరపు తాతయ్య అయిన బాలకృష్ణ తన మనవడు దేవాన్ష్ కు గిఫ్ట్ గా రూ.2.4 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. దీంతో చంద్రబాబు కంటే దేవాన్ష్ ఆస్తులు ఎక్కువ అయ్యాయి.
ఈ సంవత్సరానికి గానూ తన తండ్రి ఆస్తుల్లో పెద్దగా మార్పు లేదని, మార్కెట్ విలువ ప్రకారమే ఆస్తుల విలువ మారుతూ వస్తున్నాయాని, అలాగే తన కుమారుడు దేవాన్ష్ ఆస్తుల్లోనూ ఏ మార్పులేదని లోకేశ్ పేర్కొన్నారు. లోకేష్ వివరాల ప్రకారం.., చంద్రబాబు నికర ఆస్తులు రూ. 2.53 కోట్లు, భువనేశ్వరి ఆస్తులు రూ. 25.41 కోట్లు, లోకేశ్ నికర ఆస్తులు రూ. 15.21 కోట్లు, బ్రహ్మణి నికర ఆస్తులు రూ.15.01 కోట్లు, దేవాన్ష్ నికర ఆస్తులు రూ.11.54 కోట్లు.
బాబు మనవడు దేవాన్ష్. తనకు జూబ్లీహిల్స్‌లో 1191 చ. గజాల స్థలం. దాన్లో 19,500 చదరపుటడుగుల భవనం కలిపి ఉన్నాయని దాన్ని ఈ ఏడాదే రూ.9 కోట్లకు కొన్నామని చెప్పారు. చ. అడుగుకు రూ.1,500 నిర్మాణ ఛార్జీలు వేసుకున్నా దాదా పు రూ.3 కోట్లు. స్థలం విలువ కనీసం 25 కోట్లు. మరి 9 కోట్లకు ఎవరిచ్చారు? దీన్ని నానమ్మ భువనేశ్వరి బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories