బాలయ్యపై నారా లోకేశ్ సరదా కామెంట్

Submitted by arun on Mon, 02/05/2018 - 13:04
Nara lokesh

ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా సరదాగా పంచ్ లు వేస్తున్నాడు..ఆంధ్ర ఎన్నారైలతో మంత్రి లోకేష్ న్యూజెర్సీలో సమావేశం ఏర్పాటు చేశారు.. ఇందులో భాగంగా ఆంధ్ర ఎన్నారైలను లోకేష్ ప్రశ్నలు అడిగి మరి సమాధానాలు తెలుసుకున్నారు.. అయితే లోకేష్ సమావేశం జరుగుతుండగా బాలయ్య పేరు బయటకు వచ్చింది.. దీంతో అక్కడ ఉన్నవాళ్ళంతా ఒక్కసారి బాలయ్య.. బాలయ్య అంటూ నినదించారు..ఓ సందర్భంలో వారిని కట్టడి చేయడానికి లోకేశ్, బాలకృష్ణపై పొగడ్తలు కురిపించారు. సింహం గురించి తాను ఏం చెప్పాలని ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, లెజెండ్, సింహా లాంటి సినిమాల్లో బాలయ్య అద్భుతంగా నటించారని కితాబిచ్చారు. బాలయ్యపై లోకేశ్ పొగడ్తల వర్షం కురిపిస్తుంటే ఎన్నారైలు హర్షద్వానాలు పలికారు. ఎన్నారైలను ఉద్దేశించి ‘‘మీ అందరికీ ఆయన బాలయ్య.. నాకు మాత్రమే ముద్దుల మావయ్య’’ అంటూ సరదాగా వారితో లోకేశ్ సంభాషించారు.

English Title
Nara lokesh Funny Comments on balakrishna

MORE FROM AUTHOR

RELATED ARTICLES