కికీ చాలెంజ్‌కు దేశిటచ్...దుమ్మురేపుతోన్న జగిత్యాల కుర్రోళ్లు

Submitted by arun on Mon, 08/06/2018 - 10:57

కికి చాలెంజ్ ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తున్న డేంజరస్ టాస్క్. అలాంటి కికికీ జగిత్యాల యువకులు విలేజ్ స్టైల్‌లో ఓ కిక్ ఇచ్చారు. డేంజర్ టాస్క్‌ను సింప్లీఫై చేసి దిస్ ఈజ్ మై విలేజ్ షో అంటూ సోషల్ మీడియాలో వదిలేశారంతే ఇప్పుడది వైరల్‌గా మారిపోయింది.

విదేశాల్లో వినూత్నంగా పుట్టి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిని ఊపేస్తోంది కికీ చాలెంజ్. వైరల్‌గా మారిన ఈ డేంజరస్ టాస్క్ ఇప్పుడు ఇండియా వరకొచ్చేసింది. అంతేనా తెలుగురాష్ట్రాల్లోకి కూడా ఎంటరైపోయింది. అలాంటి కికీ చాలెంజ్‌కు జగిత్యాల జిల్లా లంబాడపల్లి యువకులు విలేజ్ స్టైల్లో మరో చాలెంజ్ విసిరారు. ఇప్పుడిదే వైరల్‌గా మారింది.

కికీ చాలెంజ్‌లో తేడాలొస్తే ప్రాణాలు పోతాయ్. కానీ ఇక్కడ తేడాలొచ్చినా రాకపోయినా ఇండియన్ కల్చర్‌లోని అగ్రికల్చర్ కనిపిస్తుంది. వ్యవసాయం చేసే వాళ్ల సంఖ్య తగ్గిపోతున్న ఈ రోజుల్లో మళ్లీ వ్యవసాయంలోనే మన బతుకుందని క్లియర్‌గా చెప్తుంది ఈ కుర్రాళ్ల చాలెంజ్. అందుకే ఇప్పుడీ మై విలేజ్ షో కుర్రాళ్ల చాలెంజ్ హాట్ టాపిక్‌గా మారింది.

ఎక్కడో విదేశాల్లో పుట్టి మిగతా దేశాల బౌండరీలు దాటి మన వరకొచ్చేసిన కికీ చాలెంజ్‍‌‌కు మన కుర్రాళ్లిచ్చిన విలేజ్ కిక్ ఇప్పుడు మామూలుగా లేదు. ఇప్పుడీ పొలంలో ఇచ్చిన కిక్కే ఇండియాను ఊపేస్తోంది. ఆ కికీ చాలెంజ్‌పై అంతా దుమ్మెత్తిపోస్తుంటే ఈ యువకులు చేసిన టాస్క్‌పై మాత్రం ప్రశంసలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

English Title
My Village Show KIKI Challenge Dance With Bullocks In Jagtial

MORE FROM AUTHOR

RELATED ARTICLES